Begin typing your search above and press return to search.

మంత్రి జవహర్‌ వైపే చంద్రబాబు చూపు

By:  Tupaki Desk   |   2 March 2019 7:36 AM GMT
మంత్రి జవహర్‌ వైపే చంద్రబాబు చూపు
X
టీడీపీ అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఒక్కో జిల్లాను కంప్లీట్‌ చేసుకుంటూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తన దగ్గరున్న సర్వే రిపోర్టులు - నియోజక వర్గంలో ఎమ్మెల్యేలో వచ్చిన రిపోర్టుల్ని రెండూ పక్కపక్కన పెట్టుకుని అభ్యర్థుల్ని ఫైనల్‌ చేస్తున్నారు. సర్వే రిపోర్ట్‌ బావుండి ఎలాంటి కాంపిటీషన్‌ లేకపోతే.. సిట్టింగ్‌ కే సీటు ఎనౌన్స్‌ చేస్తున్నారు. కాంపిటీషన్ ఉన్నచోట మాత్రం అందర్తని కూర్చోపెట్టి మాట్లాడి.. ఒక అభ్యర్థిని ఫైనల్‌ చేస్తున్నారు.

ఇప్పుడు పశ్చిగోదావరి జిల్లాలో అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు చంద్రబాబు. ఈ జిల్లాలోనే కొవ్వూరు నియోజక వర్గం ఉంది. ఇక్కడనుంచి మంత్రి జనహర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్నారు. అయితే.. ఈసారి మంత్రి జవహర్‌ కు సీటు ఇస్తే తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని కొవ్వూరు చెందిన టీడీపీ నాయకులు నిన్న అమరావతి వచ్చి మరీ చంద్రబాబుకి విన్నవించుకున్నారు. ఆయనకు కాకుండా తమలో ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపుకోసం పనిచేస్తామని.. మంత్రి జవహర్‌ కు మాత్రం ఇవ్వొద్దని తేల్చిచెప్పారు. అయితే.. కొవ్వూరు సీటు ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం మంత్రి జవహర్‌ వైపే మొగ్గు చూపుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. మంత్రి జవహర్‌ మొదటినుంచి వివాదరహితుడు. ఆయనపై ఎలాంటి అలిగేషన్స్‌ లేవు. అన్నింటికి మించి చాలా యాక్టివ్‌ గా ఉంటారు. టీడీపీని - ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే.. . అందరికంటే ముందు మీడియాకు ముందుకు వచ్చి కౌంటర్‌ ఇస్తారు. నియోజక వర్గ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటారు. ఆయన పనితీరు - సర్వే రిపోర్టులపై కూడా చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారు. కాంపిటీషన్ ఉన్నా కూడా చంద్రబాబునాయుడు - లోకేష్‌ ఇద్దరూ మంత్రి జవహర్‌ నే మళ్లీ కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారట.

...ఎస్ ఆర్ కే