Begin typing your search above and press return to search.
యాడ్స్ లో బాబు దే పైచేయి!
By: Tupaki Desk | 2 April 2019 4:51 AM GMTఎన్నికల వస్తే చాలు.. ప్రజల మనసుల్నిప్రభావితం చేసేలా.. కంటి ముందు కనిపించే అభివృద్ధికి పది రెట్లు ఎక్కువగా చూపే మాధ్యమంగా యాడ్స్ ను చెప్పకతప్పదు. ప్రచార సామాగ్రి ఎంత ఉన్నా.. ఇప్పుడు నడుస్తున్న వీడియోల జమానాలో ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు వీలుగా పార్టీలు వీడియోల్ని తయారు చేస్తున్నారు. పోటీలోనూ.. ప్రచారంలోనూ పోటాపోటీగా ఉన్న టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు యాడ్స్ తయారీ విషయంలో మాత్రం రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెప్పక తప్పదు.
గతంలో ఎప్పుడూ లేని రీతిలో తమ ఎన్నికల ప్రచార యాడ్స్ ను తయారు చేసే బాధ్యతను ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీనుకు తెలుగుదేశం పార్టీ అప్పజెప్పింది. దీంతో.. తాను నిర్మించే యాడ్స్ అదరిపోయేలా ఉండాలన్న ఉద్దేశంతో చాలా రిచ్ గా తీసినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల వేళ తయారు చేసే యాడ్ క్వాలిటీకి ఏ మాత్రం సంబంధం లేనంత క్వాలిటీగా రాజకీయ ప్రకటనల్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.
సినిమా రేంజ్ కు తగ్గకుండా టీడీపీ యాడ్స్ ను సిద్ధం చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల మనసుల్ని దోచేలా యాడ్స్ ను సిద్ధం చేయటానికి టీడీపీ ఇంత ఎత్తున కసరత్తు చేస్తే.. ఆయన ప్రత్యర్థి వర్గం మాత్రం యాడ్స్ మీద పెద్దగా ఫోకస్ పెట్టకపోవటం గమనార్హం.
తాను నిర్వహించే భారీ పనుల్లో బోయపాటి సినిమా టాలెంట్ ను ప్రదర్శించేలా బాబు అవకాశం ఇవ్వటం తెలిసిందే. ఇలాంటి ప్రయత్నంలోనే గోదావరి పుష్కరాలు ఎంత రచ్చగా మారాయో తెలిసిందే. ఈసారి ఆ తప్పులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు.. తాము తయారు చేసిన ప్రకటనల విషయమై గొప్పలు చెప్పుకోకుండా.. చానళ్ల స్లాట్లు తీసేసుకున్నారు.
మిగిలిన ప్రచారంలో రెండు పార్టీలు పోటాపోటీ పడుతున్నా.. యాడ్స్ ప్రచారంలో మాత్రం జగన్ పార్టీ వెనుక బడిందన్న మాట వినిపిస్తోంది. విషయం ఏదైనా కానీ బాబు కంటే ఒక అడుగు ముందు ఉండాలన్న జగన్.. యాడ్స్ తయారీ విషయంలో ఎందుకని ప్రాధాన్యత ఇవ్వలేదన్నది ఇప్పుడు ఆసక్తికరచర్చకు తెర తీసింది. బాబు నమ్మకంతో తనకు అప్పగించిన పనిని పూర్తి చేయటంలో బోయపాటి తన టాలెంట్ పూర్తి స్థాయిలో ప్రదర్శించారని చెప్పక తప్పదు.