Begin typing your search above and press return to search.
ఆంగ్ల మీడియాకు అడ్డంగా బుక్కవుతున్న బాబు
By: Tupaki Desk | 14 Jun 2017 6:21 AM GMTముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీలో ఏం చేసినా చెల్లిపోతుంది. ఆయన్ను అడిగేవారే లేరు. రాజకీయంగా ప్రశ్నించేవారు ఉన్నా మీడియా మాత్రం చంద్రబాబును పల్లెత్తు మాట కూడా అనే పరిస్థితి లేదు. తెలుగు మీడియా చంద్రబాబును చూసి ముచ్చట పడడం తప్ప ఇంకేమీ చేయడంలేదు. కానీ.. నేషనల్ మీడియా మాత్రం చంద్రబాబు టీం చేస్తున్న పొరపాట్లను ఏకి పడేస్తోంది. చంద్రబాబు స్వయంగా తప్పులు చేశారా లేదా అన్నది పక్కన పెడితే ఆయన టీం చేసిన తప్పులకు పరోక్షంగా ఆయనే బాధ్యుడు అవుతారన్నది తెలిసిందే. మొన్నటికి మొన్న కాకినాడలో చంద్రబాబు కాన్వాయ్ కారణంగా ఓ అంబులెన్సు 20 నిమిషాలు ఆగిపోయి అందులోని రోగి నానా ఇబ్బందులు పడ్డాడు... ఆ విషయం నేషనల్ మీడియాలో వచ్చింది కానీ ఏపీలో ఎవరూ రాయలేదు.
తాజాగా అలాంటిదే మరో అంశాన్ని ఇంగ్లీష్ మీడియా గుర్తించి చంద్రబాబు కార్యాలయం చేసిన పొరపాటును చెప్పింది. చంద్రబాబు సీఎంఓ చేసిన పొరపాటుపై హక్కుల సంఘాలూ ఫైరవుతున్నాయి.
అసలు విషయం ఏమిటంటే గుంటూరుకు చెందిన 13 ఏళ్ల అమ్మాయిని.. 45 ఏళ్ల మాజీ బీఎస్ ఎఫ్ జవాన్ నాగేశ్వరరావు బంధించాడు. 45 రోజుల పాటు అమ్మాయిపై దాడికి తెగించాడు. అయితే దర్యాప్తు చేసిన గుంటూరు పోలీసులు 45 రోజుల తర్వాత నాగేశ్వరరావు చెర నుంచి బాలికను రక్షించారు. కాశ్మీర్ నుంచి అమ్మాయిని తిరిగి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. అమ్మాయికి ధైర్యంచెప్పిన ముఖ్యమంత్రి… అమ్మాయికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే బాలిక కుటుంబసభ్యులతో చంద్రబాబు ఫొటో దిగారు. ఆ తరువాత ఆ ఫొటో సీఎంఓ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అంతే దుమారం రేగింది. చట్ట ప్రకారం ఈ తరహా దాడులకు గురైన చిన్నారులకు సంబంధించిన ఫొటోలను గానీ, పేర్లను గానీ, తల్లిదండ్రుల వివరాలను గానీ, వారి అడ్రస్ గానీ ఎక్కడా ప్రచురించకూడదు. అలా చేయడం నేరం. కానీ, రాష్ర్టముఖ్యమంత్రి ట్విట్టర్ ఖాతాలోనే ఆ నేరం జరిగిపోయింది.
సాధారణంగా మీడియాలోనూ ఇలాంటి ఫొటోలు ప్రచురించేటప్పుడు బాధితుల ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ సీఎంవో ఆ జాగ్రత్త కూడా తీసుకోలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన పని వల్ల భవిష్యత్తులో ఆ బాలిక అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావచ్చునని ఆంగ్ల వెబ్ సైట్లు అభిప్రాయపడ్డాయి. అయితే.... ఈ విషయంలో మీడియాలో రావడంతో జరిగిన పొరపాటును గుర్తించి ట్విట్టర్ నుంచి ఆ ఫొటోను తొలగించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/