Begin typing your search above and press return to search.
రెండు రోజులు గోవా ట్రిప్ వెళ్లనున్న బాబు
By: Tupaki Desk | 1 Sep 2016 6:08 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టూర్ కు వెళుతున్నారు. గడిచిన కొద్దిరోజులుగా విపరీతమైన పని ఒత్తిడితో అలిసిపోయిన ఆయన కాస్తంత సేద తీరాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే తాజాగా టూర్ ప్లాన్ చేశారు. విభజన నేపథ్యంలో బాబు ఫ్యామిలీ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. గతంలో వారాంతంలో హైదరాబాద్ వచ్చి వెళ్లే ఆయన.. ఈ మధ్యన అది కూడా తగ్గించేశారు. బాబు కుటుంబ సభ్యులే బెజవాడకు వెళుతున్న పరిస్థితి.
ఇటీవల కృష్ణా పుష్కరాలతో విపరీతమైన పని ఒత్తిడికి లోనైన ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త రిలీఫ్ కోసం ఆయన రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గోవాట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్న ఆయన మరో రెండు రోజులు రాయలసీమలోనే ఉండనున్నారు. సీమ నుంచి నేరుగా గోవాకు వెళ్లనున్న సీఎం.. ఫ్యామిలీ మెంబర్స్ తో రెండు రోజులు గడిపిన తర్వాత తిరిగి ఏపీకి వచ్చేయనున్నారు. వినాయక చవితి పండగ రోజు నాటికి తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకున్నట్లు చెబుతున్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు విదేశాలకు వెళ్లే అలవాటున్న చంద్రబాబు.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోవాకు వెళ్లటం గమనార్హం.