Begin typing your search above and press return to search.
జనాలను బాబు బాగా తక్కువ అంచనా వేస్తున్నారా!
By: Tupaki Desk | 4 April 2019 1:30 AM GMTచంద్రబాబు నాయుడు జనాలను బాగా తక్కువ అంచనా వేస్తారనేది ఆయన మాటలను బట్టి చూస్తేనే అర్థం అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడిన అంశాల గురించి బాబుగారి స్పందనను బట్టే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కీలకమైన ప్రత్యేకహోదా అంశం లోనే చంద్రబాబు నాయుడు ఎంత నిర్మొహమాటంగా మాట మార్చారో అందరికీ తెలిసిందే. తను మాట్లాడే ప్రతిమాటా వీడియోల్లో రికార్డు అవుతుంది అని తెలిసి కూడా బాబు ప్రత్యేకహోదా విషయంలో అనేక యూటర్న్ లు తీసుకున్నారు.
తన అవసరానికి తగ్గట్టుగా ఎలా పడితే అలా మాట్లాడారు. మోడీ విషయంలోనూ - బీజేపీ విషయంలో కూడా బాబు అలాగే మాటలు మార్చారు. మోడీ నిధుల కేటాయింపు బ్రహ్మాండంగా చేశారని ఏపీ అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం పెట్టిన బాబు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మోడీ మోసం చేశారంటూ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. బాబు తన అవసరం మేరకు అలా మాటలు మార్చేస్తూ ఉంటారు. జనాలు వీటిని ఎలా తీసుకుంటారో ఈ సారి ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు!
ఆ సంగతలా ఉంటే.. బాబు జనాలను బాగా తక్కువ అంచనా వేస్తున్నారని చెప్పడానికి మరో రుజువు ఎన్నికల ముందు బాబుగారు ప్రజలకు వేస్తున్న తాయిలాలు. ప్రభుత్వ పరంగా బాబు ఎప్పుడో చేయాల్సిన పనులకు సంబంధించిన నిధులను ఇప్పుడు ప్రజల ఖాతాల్లోకి సర్దే ప్రయత్నం సాగుతూ ఉంది.
రైతు రుణమాఫీ నే తీసుకుంటే..అధికారంలోకి రాగానే సమస్త రైతు రుణాలూ మాఫీ అని బాబుగారు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. తాకట్టులోని బంగారాన్ని కూడా విడిపించడం అని ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రచారంతో రైతు కుటుంబాల ఓట్లు సాలిడ్ గా పడిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అర్హుల వడపోతలో చాలా మంది రైతు రుణమాఫీకి అనర్హులు అయ్యారు!
ఇక బాబుగారు తేల్చిన అర్హులకు కూడా విడతల వారీగా మాఫీ అన్నారు. మూడు విడతలు జమచేశారు.ఇంకా రెండు విడతలు పెండింగ్ లో ఉన్నట్టే ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వాటిని జమ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రెండేళ్ల కిందట జమ కావాల్సిన మొత్తాలు ఇప్పటి వరకూ జమ కాకపోవడంతో.. రైతులు తీసుకున్న అప్పులపై వడ్డీలు పెరిగిపోయాయి. ఇప్పుడు బాబు వేసే సొమ్ములకూ - వడ్డీలకు పోల్చి చూస్తే రైతులకు ఒరిగేది ఏమీ లేదు.
అది కూడా ఇప్పుడు కూడా.. నాలుగు ఐదో విడతల మొత్తం సొమ్ములు వేయరట. ఆ మొత్తాల్లో పదో శాతం డబ్బు మాత్రమే పోలింగ్ కు ఏ ముందు రోజో రైతుల ఖాతాల్లోకి పడవచ్చని చెబుతున్నారు. అంటే యాభై అరవై వేల మాఫీ సొమ్ములు రావాల్సిన రైతులకు కూడా ఐదారు వేలు వేయబోతున్నారట!
అది కూడా పోలింగ్ కు ఏ ముందు రోజో వేస్తారట. తద్వారా ప్రలోభ పెట్టాలనే స్కెచ్ అమలు చేస్తున్నారని స్పష్టం అవుతోంది. ఇదంతా చూస్తుంటే రైతులను బాబు బాగా తక్కువ అంచనా వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తే కానీ బాబుకు ఇప్పుడు ఆయన గురించి రైతులు ఏమనుకుంటున్నారో అర్థం కాదని వ్యాఖ్యానిస్తున్నారు!