Begin typing your search above and press return to search.
బాబు అసంతృప్తికి గురి అవ్వాల్సి వచ్చింది
By: Tupaki Desk | 3 Nov 2016 1:15 AM GMTనవ్యాంధ్రప్రదేవ్ రాజధాని అమరావతి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒకేరోజు రెండు పరిణామాల్లో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కున్నారు. అమరావతి నిర్మాణంపై తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి బాబును తీవ్రంగా ఇబ్బంది కలిగించింది. నిర్మాణం పనులు వేగవంతంగా జరగట్లేదంటూ సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు హాజరయ్యారు. డిసెంబర్‌లోగా సీడ్ యాక్సెస్ రహదారి పూర్తి కావల్సి ఉన్నప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదంటూ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతే కాకుండా మిగతా మౌళిక వసతుల విషయంలోనూ అసలేమాత్రం వేగం లేదంటూ అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఆశించిన స్థాయిలో నిర్మాణ పనులు జరగట్లేదని, ఇలా అయితే అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుందంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లి భవన నిర్మాణ ఆకృతులపైనా సమావేశంలో చర్చించారు. ఇదిలాఉండగా ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఎన్జీటీ లో పిటిషనర్ తరపు వాదనలు కొనసాగాయి. కృష్ణానది చుట్టూ ఉన్న 13 ద్వీపాల్లో నిర్మాణాలు చేపట్టొద్దని, పర్యావరణానికి హానీ కలిగిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కొండవీటి వాగు దిశను మార్చడం ప్రమాదకరమన్నారు. అభ్యంతరాలు లేవనెత్తిన వారి వాదనలు విన్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం స్వీకరించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తుది తీర్పు ఇవ్వనుంది. ఇలా ఒకే రోజు అమరావతి విషయంలో బాబు అసంతృప్తికి గురి అవ్వాల్సి వచ్చింది.