Begin typing your search above and press return to search.
అవినాష్ ను బాబు మళ్లీ బలి చేస్తాడా...!
By: Tupaki Desk | 31 Oct 2019 12:38 PM GMTఏపీలో గన్నవరం - వల్లభనేని వంశీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వంశీ టీడీపీకి రాజీనామా చేయడం... బుధవారం బాబు సూచన మేరకు ఎంపి కేశినేని నాని - కొనకళ్ల నారాయణ సుదీర్ఘంగా చర్చలు జరిపినా వంశీ పార్టీలో ఉండేందుకు ఇష్టపడకపోవడంతో వంశీ టీడీపీని వీడడంపై క్లారిటీ వచ్చేసింది. ఇక వంశీ వైసీపీలోకి వెళ్లేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గురువారం గన్నవరం నియోజకవర్గ టీడీపీ సమీక్షా సమావేశం జరిగింది.
నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా పట్టున్న నేతగా ఉన్న వంశీ రాజీనామా చేసినా కూడా ఈ సమావేశానికి టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. వంశీ పార్టీని వీడినా తాము మాత్రం టీడీపీని వీడే ప్రసక్తేలేదని... బాబు మాటే తమకు శిరోధార్యమని వారంతా కుండబద్దలు కొట్టేశారు. ఇక ఈ సమావేశంలోనే ఇక్కడ నాయకత్వ మార్పు చేయాల్సి వస్తే దేవినేని అవినాష్ కు గన్నవరం బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారు. అక్కడకు వచ్చిన కార్యకర్తలు కూడా జై అవినాష్ అంటూ నినాదాలు చేశారు.
గన్నవరంలోనూ అవినాష్ బలిపశువేనా...
ఈ యేడాది జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు చంద్రబాబు దేవినేని అవినాష్ ను సర్దుబాటు చేసే క్రమంలో గుడివాడకు పంపారు. గుడివాడలో కొడాలి నాని కొన్ని సంవత్సరాలుగా తిష్ట వేసుకుని ఉన్నారు. వైసీపీలో బలమైన ప్రత్యర్థి.. ఓటమే లేదు. అలాంటి చోట ఏ నందమూరి ఫ్యామిలీకి చెందిన వాళ్లనో లేదా ఏ లోకేష్ నో పోటీ చేయించకుండా అవినాష్ ను పోటీ చేయించారు. అవినాష్ కు అక్కడ పోటీ చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అక్కడ ఏకంగా రు.80 కోట్ల వరకు చేతి చమురు వదిలించుకున్నా నాని చేతిలో ఘోరంగా ఓడిపోయారు.
గుడివాడలో ఓటమి తర్వాత అవినాష్ అక్కడ పనిచేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలోకి వెళ్లిపోతారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటిని అవినాష్ ఖండించారు. అవినాష్ కన్ను మాత్రం తూర్పు నియోజకవర్గం మీద ఉన్నా అక్కడ గద్దె రామ్మోహన్ ఉండడంతో అవినాష్ కలలు నెరవేరే ప్రశక్తే లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి అవినాష్‌ను గన్నవరంలో పోటీ చేయించే ఆలోచన బాబుకు వచ్చినట్టు తెలుస్తోంది.
అవినాష్ ఇంటికి అతి సమీపం నుంచే గన్నవరం స్టార్ట్ అవుతుంది. గుడివాడకు అవినాష్ పూర్తిగా నాన్ లోకల్ అవుతాడు. అదే గన్నవరంలో చాలా వరకు సిటీలో ఉండడంతో ఇక్కడ పోటీ చేయించాలని బాబుతో పాటు మాజీ మంత్రి ఉమా సైతం ప్లాన్ చేస్తున్నట్టు టీడీపీ వర్గాల చర్చల ద్వారా ఈ రోజు మ్యాటర్ బయటకు వచ్చింది. ఒకవేళ అదే జరిగిన పక్షంలో అవినాష్ గన్నవరంలో మళ్లీ గెలిచే స్కోప్ తక్కువ. వంశీకి అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్ ఇమేజ్ ఉంది. ఈ విషయం మొన్న ఎన్నికల్లో కూడా ఫ్రూవ్ అయ్యింది. ఇక ఇప్పుడు అవినాష్ ఇక్కడ పోటీ చేస్తే ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ యువనేతను బాబు - ఉమ కలిసి మళ్లీ బలి పశువును చేసినట్టే అవుతుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి అవినాష్ గన్నవరం విషయంలో ఒత్తిళ్లు ఉన్నా ఎలాంటి డెసిషన్లు తీసుకుంటారో ? చూడాలి.