Begin typing your search above and press return to search.
హమ్మయ్య... బాబుకి వాస్తు సెట్ అయ్యిందంట!
By: Tupaki Desk | 10 Nov 2016 2:11 AM GMTవాస్తు అనే విషయం వ్యక్తిగతం నుంచి వ్యవస్థాగతం అయిపోయి చాలా రోజులే అయ్యింది! దేశానికీ, రాష్ట్రాలకూ ఈ వాస్తు ఉందో లేదో తెలియదు కానీ రాష్ట్ర రాజధానులకు, ముఖ్యమంత్రుల ఇల్లకు, సచివాలయాలకు, కుర్చునే కుర్చీలకు, పడుకునే మంచాలకు కూడా వాస్తులు చూసే పరిస్థితులు వచ్చేశాయి! ఈ క్రమంలో గతకొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో వాస్తు గురించి ఈ మధ్య బాగా చర్చ జరుగుతోంది. వాస్తు విషయంలో ఇద్దరు సీఎంలు బహు సీరియస్! ఆ వాస్తు రాష్ట్రప్రజల గురించా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... తమకు తమ వారసులకు తమ వ్యక్తిగత జీవితాలకూ కలిసివస్తుందా లేదా అనే కోణంలోనే ప్రధానంగా ఆలోచిస్తున్నారనేది తాజా కామెంట్! ఈ సమయంలో వాస్తుకోసం హైదరాబాద్ లోని చాలా మార్పులు చేయించిన బాబు... "ఏపీ వాసులకు దైర్యం ఇవ్వడానికి" ఉన్నట్లుండి అమరావతికి వెళ్లిన అనంతరం వెలగపూడిలో నిర్మించిన కొత్త ఆఫీసుకు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త ఆఫీసు వాస్తు బాబుకి మహబాగా కలిస్తొస్తుందట.
ఈ సందర్భంగా వాస్తువిషయంలో కాస్త గట్టిగానే ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... వెలగపూడి భవనం వాస్తు బాగా కలిసి వచ్చిందని అంటున్నారట. కొత్త సచివాలయంలోకి వెళ్లిన తర్వాత ఏపీలో అన్ని అద్భుతాలు జరిగాయా? అంటే దానికీ బాబు గారి వద్ద ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ విషయంలో కొత్త ఆఫీసుకు వచ్చాక తాను చేసిన తొలి రెండు సంతకాలు సక్సెస్ ఫుల్ గా వర్కౌట్ అయ్యాయి అని చెబుతున్నారు సీఎం. వాటిలో మొదటిది... "ప్రధానమంత్రి నరేంద్రమోడీకి నోట్లు రద్దుచేయడంపై లేఖ రాయడం"! నల్లధనం నిర్మూలనకై బాబు తనదైన సూచనలు చేస్తూ మోడీకి లేఖ రాసి సంతకం పెట్టారట! ఇక రెండోది ఏమిటంటే... "డ్వాక్వా మహిళలకు రెండో విడత నిధులు మంజూరు చేస్తూ" మరో సంతకం! దీంతో మొదటిది అయిపోయింది... రెండోది కూడా సక్సెస్ ఫుల్ గా అయ్యింది... అంటే, వాస్తు బలం చాలా బాగుందనే కదా!! అదే విషయాన్ని చెబుతున్నారు చంద్రబాబు.
ఈ విషయంలో కొత్తనోట్ల వ్యవహారంలో దేశం మొత్తం మోడీ పేరే చెబుతుండగా... ఏపీలోని ఒక వర్గం మీడియా మాత్రం ఆ క్రెడిట్ బాబుకీ ఇప్పించేందుకు యమ యాతన పడుతుంది. ఆ యాతన సంగతి పక్కనపెడితే... బాబు సచివాలయం వాస్తు ఈ విషయంలో మోడీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలేమో!!
ఆ సంగతులు అలా ఉంచి మనలో మనమాటగా చెప్పుకోవాలంటే... సీఎం లకు సచివాలయాలు కలిసిరావడం, కలిసిరాకపోవడం ఏమిటి? కలిసిరాకపోతే ప్రజల సొమ్ము కోట్ల రూపాయలు తగలెయ్యడమేమిటి? భారతదేశంలో ఎన్నికల సమయంలోనే ప్రజాస్వామ్యం అనే మాట తప్ప, అనంతర పాలనలో అది కనిపించడం లేదనే అనుమానాలు ప్రజలకు రాకపోవడం ఏమిటి?అయినా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారికి ఈ పట్టింపులేమిటి? సామాన్యుడికి సమాధానం దొరకని చిన్న చిన్న ప్రశ్నల్లో ఇవి కొన్ని!! ఈ వాస్తు పిచ్చి ప్రతీ ముఖ్యమంత్రికీ ఉంటే... ఎన్నికలైన తర్వాత కొత్త సీఎం వచ్చి ఆయనకు తగ్గట్లు ఆయన మార్పించేసుకుంటే.. పరిపాలన సంగతి దేవుడెరుగు, ఈ వాస్తు ప్రకారం చేసే సచివాలయాల నిర్మాణాలతోనే పుణ్యకాలం అంతా గడిచిపోతుంది కదా!!