Begin typing your search above and press return to search.
ఎన్నికల కోడ్ ను బ్రేక్ చేసిన బాబు?
By: Tupaki Desk | 17 Feb 2017 8:07 AM GMTఎన్నికల వేళ నేతలుఆచితూచి అడుగులు వేయాల్సింది. ఏ చిన్న తేడా వచ్చినా ఎన్నికల సంఘం నుంచి అక్షింతలు తప్పవు. తాజాగా కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ సంగతే చూస్తే.. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఆయన కాసింత ఉత్సాహంతో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటమే కాదు.. ఈసీ దృష్టికి వెళ్లటం..ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నట్లుగా చెప్పి వార్నింగ్ ఇచ్చేసింది. స్థాయిని చూసుకోకుండా చేసిన తప్పు పైన కరాఖండిగా వ్యవహరించే ఎన్నికల సంఘం పుణ్యమా అని.. ప్రముఖులు సైతం ఆచితూచివ్యవహరిస్తుంటారు. అనవసరంగా చిక్కుల్లో పడేందుకు ఏమాత్రం ఇష్టపడరు.
తాజాగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని చెబుతున్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్ తానేనంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలకు వెళ్లిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటల్ని పలువురు తప్పు పడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ప్రకటించిన వరాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని విపక్షాలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హామీలు ఇవ్వనంటూనే.. ప్రతి ఇంటికి మినరల్ వాటర్ అందిస్తామని.. ఎంత ఖర్చు అయినా సరే.. లెక్క పెట్టకుండా కుప్పంలో ప్రపంచ స్థాయి కమర్షియల్ బిల్డింగ్ నిర్మించనున్నట్లుగా చంద్రబాబు చెప్పటాన్ని తప్పు పడుతున్నారు. అంతేకాదు.. కుప్పంలో నిరుద్యోగం అన్నది లేకుండా చేసేందుకు ఇప్పటికే బ్రిటానియా లాంటి కంపెనీలు వచ్చాయని.. మరిన్ని కంపెనీలు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలుచేయటం కచ్ఛితంగా ఎన్నికల కోడ్ నుఉల్లంఘించటమేనని పలువురు విమర్శిస్తున్నారు. సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునే బాబుకు.. ఈ విషయాలేమీ తెలియకపోవటం ఏమిటి..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/