Begin typing your search above and press return to search.

బాబు కోడ్ ఉల్లంఘనలు.. ఈసీ కి పట్టదా?

By:  Tupaki Desk   |   5 April 2019 9:05 AM GMT
బాబు కోడ్ ఉల్లంఘనలు.. ఈసీ కి పట్టదా?
X
ఏపీ సీఎం చంద్రబాబు అధికార యావతో ఇష్టమొచ్చినట్టు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలకు నగారా మోగి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. ఏపీ సీఎం అధికారిక నివాసం.. చుట్టుపక్కల ప్రాంతాలను పార్టీ కార్యాలయంగా మార్చి ప్రలోభాల పర్వానికి దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా సీఎం చంద్రబాబు పదేపదే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఈసీ చేత చీవాట్లు తింటున్నారు. ఉండవల్లిలోని సీఎం అధికార నివాసం పక్కనే నిర్మించి ప్రజావేదికను పూర్తి స్థాయి పార్టీ కార్యాలయంగా మార్చేయడం దుమారం రేపుతోంది. గురువారం ప్రజావేతికలో క్రైస్తవులు, జమాతే ఉలేమా హింద్ నేతలతో సమావేశమై ప్రసంగించారు. తనకు ఓటు వేయాలని వారిని కోరారు. ఇక్కడే శ్రీశైలం భువనేశ్వరీ పీఠాధిపతి కైలాసగిరి స్వామిని కలిశారు. ఇవన్నీ కోడ్ ఉల్లంఘనలే కావడం గమనార్హం.

ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు అభ్యర్థులతో సమావేశాలు వంటి వాటికి ప్రజావేదికలనే వాడాలి. కానీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని నివాసాలు, కార్యాలయాలు, టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థలను బాబు ఉపయోగించుకుంటూ కోడ్ ను ఉల్లంఘిస్తున్నారు.

ఇక ఉండవల్లి ప్రజావేదికలో చంద్రబాబుతో సమావేశానికి రావాలంటూ అర్చకులను దేవాదాయశాఖ ఉన్నతాధికారులు బెదిరించడం వివాదాస్పదమవుతోంది. ఈ సమావేశానికి హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నట్టు తెలిసింది. వెళితే కోడ్ ఉల్లంఘన అని.. వెళ్లకపోతే బాబు, అధికారులు ఏం చేస్తారోనని అర్చకులు ఆందోళన చెందుతున్నారట..