Begin typing your search above and press return to search.
బాబు తాజా ‘సోమవారం’ మాట ఏమిటంటే..
By: Tupaki Desk | 18 Oct 2016 5:26 AM GMTమిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుతో పోలిస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు కాస్త భిన్నం. ఆయన ఏదైనా విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే దాని సంగతి తేల్చే వరకూ నిద్రపోరు. సవాలచ్చ పనులు తన చుట్టూ ఉన్నా.. ఆయన ప్రాధాన్యత క్రమం నుంచి మాత్రం సదరు పని మిస్ కావటం అన్నది ఉండదు. ఎవరిదాకానో ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇందుకు భిన్నం. అనుకున్న పని పూర్తి కావాలన్న తపన ఉంటుంది కానీ.. అందుకు తగ్గట్లు నిర్మాణాత్మకమైన ప్లాన్ అనేది కేసీఆర్ లో కనిపించదు. అనుకున్న టైంకి ఏదోలా పూర్తి చేయటం ఉంటుందే తప్పించి.. ఒక క్రమ పద్ధతిలో పనిని పూర్తి చేయటం.. అందుకు భారీగా తన సమయాన్నివెచ్చించటం లాంటివి కేసీఆర్ లో కనిపించవు.
కానీ.. ఏపీ ముఖ్యమంత్రి అలా కాదు. ఏదైనా పని మీద ఆయన దృష్టి పడితే.. దాని కోసం విపరీతంగా శ్రమిస్తారు. ఆయన కష్టపడే తీరు చూస్తే.. ఒక పని కోసం మరీ ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా? అనిపించేలా ఆయన తీరు ఉంటుంది. పోలవరం ప్రాజెక్టును 2019 సార్వత్రిక ఎన్నికల ముందు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని తపించే చంద్రబాబు.. గడిచిన కొద్ది నెలలుగా పోలవరం ప్రాజెక్టు పనుల్ని సమీక్షించటం కోసం ప్రతి సోమవారాన్ని కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా నిన్న (సోమవారం.. అక్టోబరు 17) పోలవరం పనుల్ని స్వయంగా వెళ్లి సమీక్షించారు. నిన్నటి వరకూ చేయాల్సిన పని.. జరిగిన పనిని సమీక్షించిన ఆయన.. అధికారుల రిపోర్టు - ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన నివేదికను సరి చూసుకోవటం.. వాటిల్లో ఉన్న వ్యత్యాసాల్ని ప్రశ్నించటంతో పాటు.. పని అనుకున్నట్లుగా సాగటం లేదన్న విషయాన్ని సూటిగా ప్రస్తావించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా 14 రోజుల పాటు పని జరగలేదన్న విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. పెండింగ్ పనిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు.
2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసిన ఆయన.. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు విడుదలయ్యేలా పనులు చేయాలన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల సమీక్ష చేస్తానని చెప్పిన తీరులోనే.. తాజాగా సోమవారం ప్రాజెక్టు పనుల్ని సమీక్షించి.. అధికారులకు.. కాంట్రాక్ట్ పనుల్ని చేపట్టిన ఏజెన్సీకి సూచనలు అందించారు. పనుల వేగాన్ని మరింత పెంచాలన్న ఆయన.. రానున్న రోజుల్లో జరగాల్సిన పనుల్ని ఎలాంటి తేడా లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. జరగాల్సిన పనులు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకోనని చంద్రబాబు హెచ్చరించారు. మొత్తానికి సోమవారం వచ్చిందంటే చాలు.. పోలవరం పనుల మీద తాను దృష్టి పెడతానన్న విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేసినట్లేనని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/