Begin typing your search above and press return to search.

‘పరామర్శ’కూ మరీ ఇంత ఆలస్యమా బాబు..?

By:  Tupaki Desk   |   4 Feb 2017 6:29 AM GMT
‘పరామర్శ’కూ మరీ ఇంత ఆలస్యమా బాబు..?
X
ఏదైనా జరిగిన వెంటనే రియాక్ట్ అవుతారన్న పేరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉంది. ఎక్కడి దాకానో ఎందుకు.. తాజాగా అమెరికాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చంద్రబాబు స్పందిస్తూ.. ట్రంప్ కారణంగా అమెరికాలోని మనోళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని..ఏపీలో మన పరిశ్రమలతోనే మనకు ఉద్యోగాలంటూ చెప్పిన వైనం వింటే కాసింత ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడెక్కడో అమెరికాలో మనోళ్లకు బాధ కలుగుతుంటే.. ప్రధాని కంటే ముందుగా బాబే స్పందించారని చెప్పాలి.

మరింత ఫాస్ట్ గా ఉండే చంద్రబాబు.. తనకెంతో సన్నిహితుడు.. మార్గదర్శకుడిగా చెప్పుకునే ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో ఉంటే పరామర్శించేది ఇప్పుడా? అన్న మాట వినిపిస్తోంది. ఈ మధ్యన అనారోగ్యానికి గురైన రామోజీ.. యశోదాలో చికిత్స పొందటం.. కాస్త కోలుకున్నారన్నంతలో బాత్రూంలో జారి పడటంతో ఆయనిప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. పెద్ద వయసులో జారి పడిన రామోజీకి అయిన గాయం కాస్త పెద్దదే అని చెబుతున్నారు. కనీసం మూడు నెలల పాటు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ మధ్యనే కూర్చుంటున్న ఆయన్ను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించటం తెలిసిందే. వాస్తవానికి కేసీఆర్ తో పోలిస్తే.. చంద్రబాబుతోనే రామోజీకి సన్నిహితమన్న విషయం తెలిసిందే. అలాంటిది పెద్దాయనకు ఓంట్లో బాగోలేదంటే పరామర్శించాల్సిన చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్రముఖ్యమత్రి కేసీఆర్ వెళ్లి వచ్చిన తర్వాత కానీ పరామర్శకు వెళ్లటం ఏమిటన్న మాట వినిపిస్తోంది.

తనకు అన్ని వేళల్లో అండగా ఉండే రామోజీ క్షేమ సమాచారాలు తెలుసుకోవటానికి.. వ్యక్తిగతంగా వెళ్లి కలవటానికి మరీ ఇంత టైం తీసుకోవటం ఏమిటన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరామర్శ అయిన తర్వాత.. కొద్ది రోజులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. చర్చగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/