Begin typing your search above and press return to search.
మోడీ సర్కారుతో బాబు రిలేషన్ కు ఢోకా లేనట్లే
By: Tupaki Desk | 9 May 2016 5:00 PM ISTఏపీ ప్రత్యేక హోదా అంశం మిత్రుల మధ్య దూరాన్ని పెంచటమే కాదు.. కొత్త ప్రత్యర్థుల్ని తయారు చేస్తుందన్న వాదనకు ముగింపు కార్డు వేయాల్సిందే. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలతో లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయం చంద్రబాబు తెలియంది కాదు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తిన్న చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేకహోదా విషయం ప్రధాని మోడీ అనుసరిస్తున్న తీరు విషయంలో స్పష్టమైన వైఖరిని అనుసరించనున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీకి ప్రత్యేకహోదా అవసరమైన విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేకున్నా.. దాన్ని సాధించుకోవటానికి పోరుబాట కంటే స్నేహాన్నే చంద్రబాబు ఎక్కువగా నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. తొందరపాటుతో మోడీతో గొడవ పెట్టుకుంటే.. కేంద్రం నుంచి సహాయ నిరాకరణ జరిగితే.. దాని వల్ల జరిగే నష్టం భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన చంద్రబాబు.. అదే విషయాన్ని పార్టీ నేతలకు వివరించినట్లుగా చెబుతున్నారు.
ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వరకూ సమయం ఉండటం.. ఇప్పటి భావోద్వేగాలు ఎన్నికల నాటికి ఉండే అవకాశం లేని నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు మోడీతో పేచీ ఏ మాత్రం ప్రయోజనం లేదని తేల్చారు. అందుకే.. బీజేపీ నేతల మీదా.. మోడీ సర్కారు మీద తీవ్ర విమర్శలు చేయకుండా ఉండాలన్న మాటను పదే పదే చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
మోడీతో స్నేహంగా ఉంటూనే.. ఏపీకి అవసరమైనవన్నీ నెరవేర్చుకునే ప్రయత్నాల్ని విడిచి పెట్టకూడదన్నట్లుగా బాబు వైఖరి ఉంది. స్నేహధర్మానికి ఎంతో విలువ ఇవ్వటం.. కేంద్రం ఎన్ని పరీక్షలు పెట్టినా రెచ్చిపోకుండా ఓపికతో.. సహనంతో వ్యవహరించారన్న భావన ఏపీ ప్రజల్లో కలగటం ద్వారా.. తమపై సానుభూతి వెల్లువెత్తే అవకాశం ఉంటుందన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. మోడీ సర్కారుతో ఇప్పుడున్న ఫ్రెండ్లీ వాతావరణాన్ని మిస్ కాకుండా చూసుకుంటూ.. తమ ఇబ్బందుల్ని తరచూ కేంద్రానికి వినతుల రూపంలో తీసుకెళ్లటం ద్వారా ఏపీ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడాలన్నదే బాబు ఆలోచనగా చెబుతున్నారు.
బతిమిలాడితే పోయేదేముందన్నట్లుగా ఉన్న బాబు.. తన ఆలోచనను తమ్ముళ్లకు వివరిస్తూ.. ఎవరూ నోరు జారొద్దన్నమాటను స్పష్టంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతల వైఖరి ఎలా ఉండాలన్న విషయంపై బాబు ఆలోచనల్ని ఒక సీనియర్ తెలుగుదేశం నేత చెబుతూ.. ‘‘ఫ్రెండ్లీగా ఉండటం. న్యాయంగా ఏపీకి రావాల్సిన వాటాల గురించి ఎప్పటికప్పుడు కేంద్రం ముందుకు తీసుకెళ్లటం. వారి ఏపీకి ఏమీ ఇవ్వకున్నా సహనంగా వ్యవహరించాలి. ఇంకా వివరంగా చెప్పలంటే.. అరే.. మనోడ్ని మోడీ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో అన్న భావన ఏపీ ప్రజలకు వచ్చేలా చేయాలన్నదే ఆయన ఆలోచన’’ అని వివరించారు. సో.. బాబు తాజా వ్యూహం నేపథ్యంలో మోడీతో రిలేషన్ కు ఏ మాత్రం ఇబ్బంది లేనట్లేనన్న మాట.