Begin typing your search above and press return to search.

దేనీకైనా రెడీ....

By:  Tupaki Desk   |   19 Jan 2019 6:50 AM GMT
దేనీకైనా రెడీ....
X
ఇదీ సినిమా టైటీల్‌ లా ఉందే అనుకుంటున్నారా.... ఇది సినిమా టైటిలైనప్పటికీ కూడా ఈ సందర్భంలో మాత్రం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కు ఇస్తున్న ఆఫర్. గత ఎన్నికలలో ఈ ఇరు పార్టీలు కలసి పోటీ చేసీ వడ్డున పడ్డాయి. ఈ సారి కూడా ప్రతిపక్షనేత - వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జగన్ మోహాన రెడ్డిని కొట్టాటంటే కష్టతరమే నని చంద్రబాబు నాయుడికి తెలుసు. అందుకే ఆయన మళ్లీ పవన్‌ కల్యాన్‌ ను తమవైపు తిప్పుకునేందుకు సన్నాహాలు ప్రారంభించారు. దీనికోసం చంద్రబాబు నాయుడు దేనీకైన రెడీ అంటున్నారు. అంటే పవన్ కల్యాణ్‌ కు ఏం కావాలంటే అదీ అన్నమాట... దీనికోసం బాబు తన పార్టీలో కాపు కులస్థులైన మంత్రి నారాయణ - నిమ్మకాయాల చిన్నరాజప్ప - చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాస రావును రాయబారానికి పంపాడానికి సిద్దపడుతున్నాట్లు తెలుస్తోంది.

రాబోయే సార్వాత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వంటరిగా బరిలోకి దిగే ధైర్యం లేదని - అందుకే ఈ మంతనాలు అని విశ్లేషకులు అంటున్నారు. అసలు పవన్ కల్యాణ్‌ కు ఏం కావాలో తెలుసుకోవాని అన్నట్టు సమాచారం. పవన్‌ కల్యాణ్‌ కు ఎన్ని అసెంబ్లీ స్దానాలు కావాలి.... ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్దులను నిలబెట్టకూడదు వంటి అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికలలో తమ కూటమి గెలిస్తే పవన్‌ కు ఉపముఖ్యమంత్రి పదవికూడా ఇవ్వటానికి తమకు అభ్యతరం లేదని చంద్రబాబు చెబుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు అడిగినని మంత్రి పదవులు - కోర్పోరేషన్ పదవులు కూడా ఎరగా వేసి పవన్‌ కల్యాణ్‌ ను తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేసేందుకు సిద్దం చేయాలని బాబు అన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాస్‌ ను - చిరంజీవి దగ్గరకు పంపి - పవన్‌ కల్యాణ్‌ కు నచ్చచెప్పాలని రాయబారం చేయిస్తున్నట్లు చెబుతున్నారు. తమలో తాము వివాదలతో కాలం వెల్లబుచ్చితే ఫ్యాను గాలికి తామిద్దరమూ ఎగిరిపోక తప్పదని - జగన్‌ ను ఓడిస్తే తామిద్దరమూ లాభపడవచ్చునని - పవన్‌ కు నచ్చచెప్పాలని బాబు కాపు నాయకులు - మంత్రులు వద్ద అన్నట్లు సమాచారం. ఇలా చంద్రబాబు నాయుడు - పవన్ కల్యాణ్ అడిగిందే తడువుగా దేనికైన రెడీ అంటున్నారు. మరి పవన్ కల్యాణ్ బాబు ఇచ్చిన ఆఫర్‌ కు తలొగ్గుతారా... లేదా వంటరిగానే బరిలోకి దిగుతారా అన్నది తేలాల్సి ఉంది.