Begin typing your search above and press return to search.
సుజనా, సీఎం రమేశ్‌లపై బాబు ఫైర్!!
By: Tupaki Desk | 11 Aug 2016 10:46 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫున ఢిల్లీలో ఉండి ఏపీ కోసం పాటుపడాల్సిన టీడీపీ ఎంపీలు సొంత కార్యాచరణతో పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారని తెలుగుదేశం పార్టీలో చర్చ నడుస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వర్సెస్ సీఎం రమేశ్ అనే వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సీఎం రమేశ్ తీరుతో సుజనా చౌదరి ఇబ్బంది పడగా ఆ సమస్యను పరిష్కరించేందుకు బాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరీ రాజ్యసభ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో సీఎం రమేశ్ కొత్త లెక్కలు వేసుకున్నారని సమాచారం. సుజనా పదవి కోల్పోయిన తర్వాత ఆయన మంత్రి పదవిని తను చేజిక్కుంచుకోవచ్చని రమేశ్ భావించారని, ఈ క్రమంలోనే సుజనాకు చెందిన ఆర్థిక అక్రమాల వివరాలను గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు అందించి తద్వారా సుజనా గురించి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇక్కడే సీన్ రివర్స్ అయిందని అంటున్నారు. చంద్రబాబు సుజనాకు తిరిగి ఎంపీ పదవి కట్టబెట్టారు. అదే క్రమంలో ఆయన కేంద్ర మంత్రి పదవి కూడా భద్రంగా ఉండిపోయింది. ఇదిలాఉండగా కేంద్ర మంత్రి పదవి కోసం సుజనా చౌదరి లక్ష్యంగా సీఎం రమేశ్ చేసిన ఘనకార్యం చంద్రబాబు దృష్టికి వెళ్లిందని సమాచారం.
రాజకీయ లక్ష్యాల కోసం పార్టీ పరువును ఢిల్లీ వేదికగా గంగ పాలు చేశారంటూ సీఎం రమేశ్‌పై బాబు ఫైర్ అయ్యారని సమాచారం. అంతేకాకుండా అవకతవకలకు పాల్పడటం వల్లే ఎదుటివారి చేతుల్లో ఇక్కట్ల పాలు కావాల్సి వస్తోందని సుజనా చౌదరికి సైతం బాబు తలంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇకనుంచి సఖ్యతతో ఉండాలని బాబు ఉపదేశించారని సమాచారం. ఇదిలాఉండగా... పార్టీ అధినేత చెప్పినప్పటికీ ఈ ఇద్దరు రాజ్యసభ సభ్యుల మధ్య ఎప్పట్లాగే కోల్డ్ వార్ నడుస్తోందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.