Begin typing your search above and press return to search.
ఐయామ్ ద ఫైర్ అంటున్న బాబు..
By: Tupaki Desk | 26 Sep 2015 6:40 AM GMTతెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగ్రరూపం దాల్చారు. సహజంగా సౌమ్యంగా మాట్లాడే బాబు...అందుకు భిన్నంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒకవైపు తాను నిద్రాహారాలు మాని పనిచేస్తుంటే...పరిస్థితులు సహకరించకపోవడం ఏమిటంటూ అభ్యంతరం తెలిపారు. ఇంతకీ చంద్రబాబు ఎందుకలా ఫైరయ్యారంటే ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దీక్ష గురించి.
ప్రత్యేక హోదాపై వైసీపీ అధ్యక్షుడు జగన్ గుంటూరులో తలపెట్టిన దీక్షను ఉద్దేశించి చంద్రబాబు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రౌద్రరూపుడు అయ్యారు. నవ్యాంధ్ర 16 నెలల పసిబిడ్డ అని - ఎన్నో కష్టాలు - ఇబ్బందులు పడుతూ పెంచుకుంటూ వస్తున్నామని తెలిపారు. పునర్నిర్మించుకుంటూ వస్తున్న తమపై బురద చల్లితే రాష్ర్టానికి - ప్రజలకే నష్టమని చెప్పారు. ఏదో విధంగా సమస్యలు సృష్టించాలని కొంతమంది నాయకులు రోడ్లమీదకు వచ్చి డ్రామాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి వైసీపీ, కాంగ్రెస్ సహకరించడం లేదని ఆరోపించారు. "ఆత్మహత్యలకు ఏ ప్రభుత్వమూ అనుమతి ఇవ్వదు. దీక్షలు చేసుకోవచ్చు.. తప్పు లేదు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపవచ్చు. నేను చచ్చి పోతాను.. ఆమరణ దీక్ష చేస్తాను అంటే ఎవరైనా అనుమతి ఇస్తా రా? రాష్ట్రం కష్టాల్లో ఉంది. ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడవద్దు. ప్రత్యేక హోదాపై ప్రధానిని ఏనాడైనా అడిగారా? ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లారా?" అంటూ ప్రశ్నల వర్షం సంధించారు. "ఇక్కడ రోడ్డు మీద కూర్చుని దీక్షలు అంటే కుదరదు. రాష్ర్టాభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారి ఆటలు సాగవ్. ఎవరైనా సరే.. అరాచకాలకు పాల్పడితే అణిచివేస్తాం. మీ చర్యలతో పెట్టుబడులు రావు. టూరిజం రాదు. వచ్చే పరిశ్రమలు కూడా వెనక్కు పోతాయి. శాంతిభద్రతల విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉంటాం. మీరు రాష్ర్టాభివృద్ధికి కలిసి వస్తే సంతోషం. కోలుకునే పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దెబ్బకొట్టవద్దు. గతంలో రౌడీలను ఎలా పారదోలామో అలాగే వ్యవహరిస్తాం. రాజీపడం’’ అని చంద్రబాబు హెచ్చరించారు.
‘‘కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధుల కోసం, విదేశాల నుంచి పెట్టుబడులు సాధించుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నానని బాబు తెలిపారు.. ఢిల్లీలో రెండు రోజుల్లో పదిమంది మంత్రులను కలిశాను. అంతకు ముందు సింగపూర్ వెళ్లాను. ఎవరి కోసం ఇదంతా? నిద్ర లేదు. ఒక్కోసారి స్నానం కూడా చేయకుండా బయలుదేరే పరిస్థితులు ఎదురయ్యాయని బాబు వివరించారు. కొన్ని పార్టీ లు ప్రత్యేక హోదాపై తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. సింగపూర్‌కు దీటుగా రాజధానిని అభివృద్ధి చేస్తామని ప్రజల్లో నమ్మకాన్ని కల్పించామన్నారు. ప్రత్యేక హోదా కేంద్రంగా జరిగే రాజకీయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదన్న సంకేతాలను తాజాగా చంద్రబాబు మరోమారు పంపించారు.