Begin typing your search above and press return to search.
మైనార్టీ నేతలకు బాబు వార్నింగ్?
By: Tupaki Desk | 25 July 2017 6:08 AM GMTనంద్యాల ఉప ఎన్నిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారింది. ఒకవేళ నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తేడా కొడితే.. బాబు ఉనికికే ప్రమాదంగా మారింది.దీంతో.. సర్వశక్తులు ఒడ్డుతున్న బాబు.. నంద్యాలకు ఏం కావాలంటే అది ఇవ్వటానికి రెఢీ అవుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా బాబులోని మరో కోణం బయటకు వచ్చింది. ఇంతకాలం రిక్వెస్టుల మీద రిక్వెస్టులు చేస్తూ.. నంద్యాల ఫలితం తమకు అనుకూలంగా వచ్చేలా పావులు కదుపుతున్న బాబు.. తాజాగా తనను కలిసిన మైనార్టీ నేతల్ని ఉద్దేశించి చెప్పినట్లుగా చెబుతున్న మాటలు సంచలనంగా మారాయి. తమ సమస్యల్ని బాబు దగ్గర ప్రస్తావించేందుకు వచ్చిన మైనార్టీ నేతల్ని ఉద్దేశిస్తూ బాబు వారికి షాకింగ్ మెలిక పెట్టినట్లుగా చెబుతున్నారు.
మీరేం చేస్తారో నాకు తెలీదు.. ప్రార్థన చేస్తారో.. కన్విన్స్ చేస్తారో కానీ.. మీ వాళ్ల ఓట్లు మొత్తం మన అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికే పడాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం నంద్యాలలో పర్యటించిన సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసిన మైనార్టీ పెద్దలకు ఊహించని అనుభవం ఎదురైందని చెబుతున్నారు.
ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు మొత్తం టీడీపీకే పడాలని.. వేరే వాళ్లకు వెళ్లకూడదని చెప్పినట్లుగా సమాచారం. 56వేల ఓట్ల వరకూ ఉన్నాయని.. అన్ని ఓట్లు గంప గుత్తగా టీడీపీ అభ్యర్థికే పడాలే తప్పించి వేరే వారికి పడకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదని బాబు స్పష్టం చేయటంపై మైనార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓటు వేసే విషయంలో ఇలా షరతులు విధించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించిన తర్వాత మాత్రమే తనను కలవాల్సిందిగా బాబు సూచించినట్లుగా తెలుస్తోంది. అప్పుడు మాత్రమే వారి సమస్యల పరిష్కారం కోసం తాను పని చేస్తానని చెప్పినట్లుగా చెబుతున్నారు. మైనార్టీ నేతలతో బాబు వ్యవహరించిన తీరుకు సంబంధించి బయటకు వచ్చిన సమాచారం ఆయా వర్గాల్లో చర్చగా మారటంతో పాటు.. ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉప ఎన్నిక ప్రక్రియ మొదలు కాక ముందే ఇంతగా హైరానా పడుతున్న చంద్రబాబు.. ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యాక మరెలా వ్యవహరిస్తారో.. మరెన్ని విమర్శల్ని మూటగట్టుకుంటారో చూడాలి.