Begin typing your search above and press return to search.
చంద్రబాబు వార్నింగ్ తో తమ్ముళ్లకు షివరింగ్
By: Tupaki Desk | 5 July 2017 5:32 AM GMTటీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఏం మాట్లాడుతున్నామో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని, నోటికొచ్చినట్లు మాట్లాడి ఇబ్బందులు తేవొద్దని ఆయన సూచించారు. అంతేకాదు.... అంతా బాగుందని, వచ్చే ఎన్నికల్లో తిరుగులేదని అనుకోవద్దని... అందరి గురించీ తన వద్ద సమాచారం ఉందని, ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారన్నది తనకు తెలుసని... ప్రతి ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తిగత నివేదికను వారికే అందిస్తానని... దాని ఆధారంగా రెండు నెలల్లో పనితీరులో మార్పులు చేసుకోవాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం మొదలయ్యే నాటికి మార్పు కనిపించాలి.. మీరు మారకుంటే, నేను మారాల్సి వస్తుంది అంటూ ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో టీడీపీ మంత్రులు - ఎమ్మెల్యేలకు భయం మొదలైందట.
అమరావతిలో జరిగిన టీడీపీ వర్క్ షాప్ లో ఆయన - మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు ఉపదేశం చేశారు. మాట్లాడే భాష మెరుగుపడాలని, ప్రజల్లో పలుకుబడి పెరిగేలా చూసుకోవాలని ఆయన సూచించారు. తప్పులు చేస్తూ పోతే తప్పించడం మినహా తన వద్ద వేరే మార్గం లేదని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, మీరు మారకపోతే మార్చేస్తానని హెచ్చరించారు. ఎవరు ఏ ఒక్క మాట పొరపాటుగా మాట్లాడినా, అది పార్టీ మొత్తంపై ప్రభావం చూపుతుందని, మంత్రి జవహర్ వ్యవహారాన్ని గుర్తు చేశారు.
కాగా ఈ విషయంలో ఆయన మంత్రి జవహర్ కు క్లాస్ పీకారు. 'బీరు హెల్త్ డ్రింక్' అని వ్యాఖ్యానించడమేంటని చంద్రబాబు ఆగ్రహించారు. భావ వ్యక్తీకరణ విషయంలో మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మీడియాతో మాట్లాడుతుంటే మాటలు తూలకూడదని హెచ్చరించారు. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని అన్నారు. తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలూ చేయలేదని జవహర్ వివరణ ఇవ్వబోగా, ఏం జరిగిందో తనకు తెలుసునని ముఖ్యమంత్రి కాస్త గట్టిగానే అన్నారు. ఇదంతా ఎలా ఉన్నా చంద్రబాబు పదేపదే మార్చేస్తాను... తప్పిస్తాను అని హెచ్చిరిస్తుండడంతో చాలామంది ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారట.