Begin typing your search above and press return to search.
రెవెన్యూ కి వార్నింగ్? సచివాలయం సంగతేంది?
By: Tupaki Desk | 3 Nov 2015 4:13 AM GMTరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మెతక వైఖరి పై వస్తున్న విమర్శలు.. సూచనల ప్రభావమేమో కానీ తాజాగా రెవెన్యూ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ప్రజల్ని మీరు ఇబ్బంది పెడితే.. నేను మిమ్మల్ని ఇబ్బందిపెడతా’’ అంటూ వార్నింగ్ ఇచ్చిన ఆయన.. అక్కడితో ఆగలేదు. ‘‘భూముల విషయంలో చాలా చోట్ల ఎలాంటి గొడవలు లేకున్నా రెవెన్యూ వర్గాలే కావాలని లిటిగేషన్లు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఇక.. అలాంటివి కుదరవు. బీకేర్ ఫుల్.. ఫినిష్ అయిపోతారు’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇంత కోపం.. ఇంత అగ్రహం ఎందుకంటే.. రెవెన్యూ ఉద్యోగుల అవినీతి గురించి ప్రజలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినప్పుడు.. ఆయన వీరంగమే వేశారు. రాష్ట్ర విభజన జరిగి.. ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చానని.. ఇకపై ఎలాంటి అవినీతిని సహించేది లేదంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు.
రెవెన్యూ శాఖ మీద తనకున్న వైఖరిని బాహాటంగా ప్రదర్శించి.. రెవెన్యూ ఉద్యోగుల తీరుపై తనకే మాత్రం నమ్మకం లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూశాఖ విచిత్రమైన శాఖ అని.. గతంలో కరణాలు.. మునసబులు ఉండేవారని.. వాళ్లు రాసింది వాళ్లకే అర్థమవుతుందని.. జమాబందీ పెట్టి వాళ్లు ఏది చెబితే అదే శాసనమని అందుకే ఎన్టీఆర్ ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారని గుర్తు చేసిన ఆయన.. రెవెన్యూ శాఖలో ఆ పెత్తనం ఇంకా పోలేదని తేల్చి చెప్పారు. ఒక తహసీల్దార్ కు 67 సర్టిఫికేట్లు జారీ చేసే అవకాశం ఉందని.. రెవెన్యూకి అన్ని సమస్యల నుంచి స్వేచ్ఛను ఇవ్వాల్సి ఉందంటూ.. రెవెన్యూ శాఖలో సంస్కరణల దిశగా తాను అడుగులు వేయనున్న విషయాన్ని బాబు చెప్పేశారు.
ఒక తప్పుడు విధానాన్ని అనుసరిస్తున్నా.. తప్పుడు మార్గంలో పయనిస్తున్నా.. అలాంటి వారి తీరును ఖండించటం.. అలాంటి వైఖరి చెల్లుబాటు కాదని స్పష్టం చేయటం తప్పనిసరి. రెవెన్యూ ఉద్యోగుల తీరుపై చంద్రబాబు ప్రదర్శించిన మండిపాటు ఎవరికి ఎలాంటి నొప్పి కలగలేదు. నిజానికి.. ప్రజల్లో ఒకింత సానుకూలతే వ్యక్తమైంది. ఎందుకంటే.. నిద్ర లేచింది మొదలు.. రెవెన్యూ శాఖతో సంబంధం ఉండి పనుల కోసం తిరిగే వారు పడే బాధలేంటో తెలుసు కాబట్టే ఈ సానుకూలత అంతా.
రెవెన్యూ శాఖపై తీవ్రస్థాయిలో మండిపాటు ప్రదర్శించిన చంద్రబాబు.. హైదరాబాద్ లో మాత్రమే ఉండి పని చేస్తామంటూ చెప్పే ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నది ప్రశ్న. తాము పని చేయటం తమకు నచ్చిన విధంగా.. తమకు తోచినట్లుగా అన్నట్లుగా వ్యవహరిస్తున్న సచివాలయ ఉద్యోగులపైనా చంద్రబాబు తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. తప్పు చేసే వారిని ఉపేక్షించటం చేతకానితనం అవుతుందే తప్పించి.. సమర్థత అనిపించుకోదు.
ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏదైనా అంటే తనకు ఇబ్బంది అవుతుందేమోనని చంద్రబాబు భయపడుతున్నట్లుగా ఏమీ జరగదు. ఎందుకంటే.. ఆయన ఎక్కు పెట్టింది.. అగ్రహం ప్రదర్శిస్తున్నది.. మాట వినని మొండిఘటాల మీదనే తప్పించి.. తమ పని తాము చక్కగా చేసుకుంటూ పోయే వారి మీద కాదన్న విషయం మర్చిపోకూడదు. అందుకే.. రెవెన్యూ ఉద్యోగులకు ఏ విధంగా అయితే వార్నింగ్ ఇచ్చారో.. హైదరాబాద్ వీడి వచ్చేందుకు సుతారమూ ఇష్టపడని సచివాలయ ఉద్యోగులపై ఇదే తీరుతో అగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నుంచి ఏపీ ప్రజలు కోరుకుంటున్నదదేనన్న విషయం బాబు అండ్ కో గుర్తిస్తే మంచిది.