Begin typing your search above and press return to search.
అబ్బే...మీ పనితీరు బాగోలేదు..తమ్ముళ్లకు క్లాస్
By: Tupaki Desk | 25 Jan 2019 1:30 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా ఓ లెక్క ఉంటుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లాగా తిక్క ఉండదు గానీ పక్కా లెక్క మాత్రం ఉంటుంది. ఆ లెక్కనే రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో చూపిస్తున్నారు చంద్రబాబు. రెండు రోజులుగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు - ఆశావహులు - సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో గడచిన నాలుగున్నరేళ్లుగా వారి పనితీరు - ఇతర అంశాలపై లెక్కలు తీస్తున్నారు. ఏ జిల్లా నాయకులతో సమావేశం అవుతున్నారో ఆ జిల్లా నాయకులు - శాసన సభ్యుల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. వాటిలో నిజమెంతో - అబద్ధమెంతో తెలియదు గాని ఆ బూచిని చూపించి మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి అంటూ కన్నెర్ర చేస్తున్నారు. దీంతో సమావేశానికి హాజరైన తమ్ముళ్లు తాము ఏ తప్పు చేశామోనని బెంబేలెత్తుతున్నారు.ఇది చంద్రబాబు నాయుడు వేసే ఎత్తుగడలలో ఒకటని రాజకీయ పండితులు అంటున్నారు.
వచ్చే ఎన్నికలలో ఎవరికి టికెట్లు ఇవ్వాలో - ఎవరికి ఇవ్వకూడదు ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు అలాంటి వారిని మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. దీంతో టిక్కెట్లు ఆశిస్తున్న వారు కాసింత వెనుకడుగు వేస్తున్నారు. దీనిని అనుకూలంగా మార్చుకుంటున్న చంద్రబాబు నాయుడు టికెట్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఎదుటివారిలో తప్పులు లేకున్నా వారిని డిఫెన్స్ లో పడేయడం చంద్రబాబు నాయుడు వ్యూహమని రాజకీయ పండితులు అంటున్నారు. అందులో భాగంగానే సమీక్షల పేరుతో టిక్కెట్లు ఆశిస్తున్న తెలుగు తమ్ముళ్లను- సిట్టింగ్ అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నారని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.