Begin typing your search above and press return to search.
దెబ్బకు మైండ్ సెట్ అవుతుందో..బ్లాకవుతుందో..?
By: Tupaki Desk | 12 Sep 2015 5:31 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమంటే చాలు అధికారులు, మంత్రుల మైండ్ లో ఓ మాట గింగిర్లు తిరుగుతోందట.... సమీక్ష అయినా... చర్చ అయినా... వర్క్ షాప్ అయినా... చంద్రబాబు నిర్వహించే ఏ కార్యక్రమమైనా సరే అధికారులకు, మంత్రులకు 'మీరంతా మీ మైండ్ సెట్ మార్చుకోవాలి' అని చెబుతున్నారట.. దీంతో ఆయనతో సమావేశమంటే చాలు వారి మైండ్ సెట్ మారిపోతోంది.
తన విధానాలకు అనుగుణంగా మారాలని దాదాపుగా అన్ని సమీక్షా సమావేశాల్లోనూ అధికారులకు చంద్రబాబు సూచనలు చేస్తున్నారు. పాలనలో వేగం పెంచాలని, క్షేత్ర స్థాయికెళ్లి ప్రజలతో మమేకం కావాలని బాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో కూడా విడిగా అధికారులకు క్లాస్ ఇచ్చారని సమాచారం. అనేక కార్యక్రమాలపై సలహాలు కోరే చంద్రబాబు వారేదైనా చెప్పేలోగానే మైండ్ సెట్ మార్చుకోవాలని సూచిస్తుండటంతో అధికారులకు మైండ్ సెట్ కావడమేమే కానీ మైండ్ బ్లాక్ అవుతోందట. మంత్రులకు కూడా సీఎం ఇదే సూచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశాల్లో కొందరు మంత్రులు నోరెత్తడం లేదట. ఏం మాట్లాడితే ఏమంటారో అన్న భావనతో ఎందుకొచ్చిన గొడవ... మన మైండ్ సెట్ ఇంతే మారదు.. అనుకుంటూ మౌనంగా ఉంటున్నారట. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో ఒక అధికారి కొన్ని సూచనలు చేయబోగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ముందు నీ మైండ్ సెట్ మార్చుకోవయ్యా అన్నారట.