Begin typing your search above and press return to search.
పవన్ కు నేనే చెపుతా...చంద్రబాబు వార్నింగ్
By: Tupaki Desk | 22 Aug 2015 12:20 PM GMTఏపీ రాజధాని భూసేకరణ వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్వీట్లకు విమర్శనాత్మక సమాధానాలు చెప్పొద్దని సీఎం చంద్రబాబునాయుడు తన సహచర మంత్రులకు, ఎమ్మెల్యే లకు సూచించారు. ఈ విషయమై పవన్ తో తాను స్వయంగా మాట్లాడతానని...పవన్ వ్యాఖ్యలకు ప్రతి విమర్శల తరహా సమాధానాలివ్వకుండా ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన వారికి తెలిపారు.
రాజధానిలో ఎప్పటి నుంచో తాము సాగు చేసుకుంటున్న సారవంతమైన భూమి ఇచ్చే విషయలో కొందరికి బాధగానే ఉంటుందని..అందుకే వారు పవన్ ను ఆశ్రయించారని ...వారి సంక్షేమం కోసం పవన్ వారి తరపున మాట్లాడడంలో అర్థం ఉందని.... పవన్ మాటల్లో కూడా వాస్తవం ఉన్నందున ఆయన మాటలను తప్పు పట్టాల్సిన పనిలేదని చంద్రబాబు తన పార్టీ నేతలకు సూచించారు.
పవన్ ఆదివారం రాజధాని ప్రాంతమైన తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు పవన్ షెడ్యూల్ కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. పవన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు పవన్ ప్రతినిధులు ఇప్పడికే అక్కడకు చేరుకున్నారు. అయితే రాజధాని పర్యటనకు ముందుగా ఈ రోజు లేదా రేపు ఉదయం పవన్ చంద్రబాబును కలుస్తారా లేదా రాజధాని రైతుల సమస్యలు తెలుసుకున్నాక బాబును కలిసి వారి సమస్యలు విన్నవిస్తారా చూడాలి.
ఏదేమైనా నిన్నటి వరకు పవన్ ట్వీట్లు ....టీడీపీ నాయకుల కౌంటర్లు, సెటైర్ల తో వాతావరణం వేడెక్కగా తాజాగా వారికి చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్ తో వీటికి ఫుల్ స్టాప్ పడనుంది. చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి పవన్ తో భేటీ అవుతుండడంతో ఈ వివాదం ముగిసేలా కనిపిస్తోంది.