Begin typing your search above and press return to search.

ఎప్పుడూ చెప్పటమేనా..బయటపెట్టరేం బాబు?

By:  Tupaki Desk   |   25 Dec 2019 2:30 PM GMT
ఎప్పుడూ చెప్పటమేనా..బయటపెట్టరేం బాబు?
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాటలు విన్నప్పుడల్లా ఆయన అసహాయత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీపై పట్టు ఇప్పటికే కోల్పోయిన ఆయన.. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలోనూ ఆయన కంట్రోల్ పోతోందన్న విషయం బాబు మాటల్ని విన్నప్పుడు అర్థమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత ఎందుకలా జరిగిందన్న విషయం మీద ఇప్పటికి పోస్ట్ మార్టం చేస్తున్న చంద్రబాబు.. తాను ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలోనూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

తాడేపల్లిలోని తన నివాసంలో సొంత నియోజకవర్గానికి సంబంధించిన రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతల మధ్య ఉన్న రచ్చ బయటకు వచ్చింది. స్థానిక నాయకత్వం మీద ఉన్న లోపాలు.. పార్టీ పట్ల నేతలకు.. కార్యకర్తలకు మధ్యనున్న గ్యాప్ బయటకు వచ్చింది. స్థానిక నాయకత్వ లోపాల కారణంగానే గత ఎన్నికల్లో తన మెజార్టీ తగ్గటానికి కారణంగా తేల్చారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో మెజార్టీ తగ్గటానికి కారణం ఏ నాయకుడి వ్యవహారశైలి అన్న విషయానికి సంబంధించిన సమాచారం తన దగ్గర ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా తమాషాలు మానేసి సిన్సియర్ గా పని చేయాలని హెచ్చరించారు. దశాబ్దాలకు దశాబ్దాలుగా ఇలాంటి వార్నింగ్ లు విని విని అలవాటైన తెలుగు తమ్ముళ్లు బాబు మాటల్ని లైట్ తీసుకున్నారని చెబుతున్నారు. అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని చెప్పే బాబు.. శాంపిల్ గా ఒకరిద్దరి జాతకాలు బయటకు తీసి చూపిస్తే.. మిగిలిన వారిలో అయినా భయం వస్తుంది. అందుకు భిన్నంగా ఏదో మాట వరసకు చెప్పే మాటల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవంటున్నారు. ఎప్పుడో తొంభైల నాటి డైలాగులు ఇప్పటికి మార్చకుండా వాడేస్తే ఎలా బాబు.. కాస్త వెర్షన్ మారిస్తే ప్రయోజనం ఉంటుందేమో సార్?