Begin typing your search above and press return to search.
కేసీఆర్ దెబ్బకు వేల కోట్లు వృథా చేస్తున్న బాబు!
By: Tupaki Desk | 29 Jan 2019 7:00 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - గులాబీ దళపతి కేసీఆర్ ఇస్తానంటున్న రిటర్న్ గిఫ్ట్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెదిరిపోతున్నారా? ఎలాగైనా ఆ రిటర్న్ గిఫ్ట్ ను తప్పించుకోవాలన్న ఆరాటంతో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఓటమి భయమే అందుకు కారణమా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. టీఆర్ ఎస్ ను ఓడించేందుకు ప్రయత్నించింది. అన్ని ప్రతికూలతలను అధిగమించిన కేసీఆర్ తన పార్టీని విజయపథంలో నడిపించారు. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆ వెంటనే విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో తమ ఓటమి కోసం పనిచేసిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని స్పష్టం చేశారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే దాని ప్రభావాన్ని అధిగమించేందుకు కొత్త కొత్త పథకాల బాట పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఏపీ సీఎం ప్రారంభించిన పసుపు కుంకుమ పథకం కూడా ఇందులో భాగమేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ పథకం కింద రాష్ట్రంలోని 93 లక్షల మంది డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేస్తానని చంద్రబాబుప్రకటించారు. వారందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తానన్నారు. ఇందుకు దాదాపు రూ.10 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
పసుపు కుంకుమ పథకాన్ని ప్రకటించే సమయంలో చంద్రబాబు ఆంధ్రా ఆడపడుచులకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌ను గుర్తుచేశారు. తనను ఓడిస్తానంటున్న కేసీఆర్ కు ధీటైన గిఫ్‌ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ నుంచి రక్షణ పొందేందుకే చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారన్నది ఆయన మాటలతో స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు సూచిస్తున్నారు. పసుపు కుంకుమే కాదు.. ఇటీవల కొన్నాళ్లుగా చంద్రబాబు ఏపీ ప్రజలపై ప్రకటిస్తున్న వరాలన్నీ కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్టేనని చెబుతున్నారు. అంటే కేసీఆర్ కు భయపడి చంద్రబాబు రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారన్నమాట!