Begin typing your search above and press return to search.

22న రాహుల్‌ సభ.. బాబుగారు వస్తున్నారా - లేదా.?

By:  Tupaki Desk   |   20 Feb 2019 7:56 AM GMT
22న రాహుల్‌ సభ.. బాబుగారు వస్తున్నారా - లేదా.?
X
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు గత ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. అయినా కూడా వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ కదా.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతునే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి మంచి ఆయుధం దొరికింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌ గాంధీ స్వయంగా ప్రకటించారు. దీంతో.. కాంగ్రెస్‌ నాయకుల్లో కాస్త ఆశలు చిగురించాయి. అందుకే వెంటనే బస్‌ యాత్ర స్టార్ట్‌ చేశారు. ఈ నెల 22న దీనికి రాహుల్‌ గాంధీ రాబోతున్నారు.

రాహుల్‌ గాంధీ రావడం వరకు ఓకే. అంతా బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్‌ - టీడీపీ మద్య సయోధ్య ఉంది. మొన్నటికి మొన్న తెలంగాణలో కలిసి పోటీ చేశారు. ఇక నిన్న చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తే.. రాహుల్‌ గాంధీ స్వయంగా వెళ్లారు. ఇద్దరి టార్గెట్‌ బీజేపీ మరియు ప్రత్యేక హోదా కాబట్టి.. రాహుల్‌ గాంధీ వచ్చేసభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరు అవుతారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి టీడీపీ వర్గాల్లో కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కొంతమంది వెళ్తే మంచిదని చెప్తున్నారు - ఇంకొంతమంది మాత్రం వెళ్తే.. ప్రజల్లో వ్యతిరేక భావన వచ్చి.. అది వైసీపీకి ఫేవర్‌ గా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే.. చంద్రబాబు మొదటినుంచి చెప్తోంది ఒక్కటే. టీడీపీ - కాంగ్రెస్‌ మధ్య సంబంధం బాంధవ్యాలు కేవలం జాతీయ స్థాయిలోనేనని, రాష్ట్ర స్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అనే భావన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేడర్‌ కు సూచిస్తున్నారు. అందుకే.. రాహుల్‌ సభకు చంద్రబాబు హాజరయ్యేందుకు సుముఖత చూపిస్తున్నారని సమాచారం.