Begin typing your search above and press return to search.

బాబును మనమడు దేవాన్ష్ గుర్తు పట్టేశాడోచ్

By:  Tupaki Desk   |   26 Dec 2016 5:01 AM GMT
బాబును మనమడు దేవాన్ష్ గుర్తు పట్టేశాడోచ్
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని సిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఆయన కొన్ని విషయాల్ని పదే పదే ప్రస్తావిస్తుంటారు. తాను చెప్పే మాటల కారణంగా లభించే మైలేజీ ఏమీ ఉండకపోగా.. నెగిటివ్ గా మారుతుందన్న విషయాన్ని ఆయన అస్సలు పట్టించుకోరు. ఏదైనా ఒక మాటకు మీడియాలో కాస్తంత ప్రాధాన్యం లభించేలా వార్తలు వస్తున్నాయంటే చాలు..అదే విషయాన్ని పదే పదే మాట్లాడటం ఆయనలో కనిపిస్తుంది.

ఆ మధ్యన ఆయన మాట్లాడిన ప్రతిసారీ.. తానెంత కష్టపడుతున్నది.. కుటుంబానికి దూరంగా ఉంటూ తానెన్ని త్యాగాలు చేస్తున్న విషయాన్ని చెప్పుకునే క్రమంలో తన ముద్దుల మనమడు దేవాన్ష్ తో గడపటం కుదరటం లేదని.. తాను ఇంటికి వెళితే తనను గుర్తు పట్టలేదని.. తన దగ్గరకు కూడా రావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. వయసులో చిన్నోడు కావటంతో దేవాన్ష్ గుర్తుపట్టకపోవటం పెద్ద విషయమే కాదు. చాలా కుటుంబాల్లో ఉద్యోగ అవసరాల కోసం అమ్మమ్మ..తాతయ్యల దగ్గరో.. నానమ్మ.. తాతయ్యల దగ్గరో మనమలు పెరుగుతుంటారు. సెలవులకు వచ్చే తల్లిదండ్రుల్ని కాస్తంత కొత్తగా చూస్తారు. వయసు పెరిగే కొద్దీ.. తన తల్లిదండ్రులు ఎవరన్నది వారు అర్థంచేసుకోవటం.. వారి కోసం ఆరాటపడటం మామూలే. అయితే.. ఇదంతా కుటుంబం కోసం చేస్తుంటారు. ఇలాంటి మామూలు విషయాన్ని అదేదో తనకు మాత్రమే జరుగుతున్న నష్టంగా ఆయన మాటలున్నట్లు కనిపిస్తాయి.

ఇక్కడ మనమడు గుర్తు పట్టకపోవటం.. బాబు ఆవేదనను తప్పు పట్టటం మా ఉద్దేశం కాదు. కాకుంటే.. కొన్ని బాధ్యతల నేపథ్యంలో ఇలాంటివి కామన్ అని.. ఇలాంటి త్యాగాలు అన్ని కుటుంబాల్లోనూ ఉంటాయని చెప్పటమే ఉద్దేశం. అందులోకి విభజన జరిగి.. రాజధాని లేక.. పుట్టెడు కష్టాల్లో ఉన్నప్పుడు మనమడు గుర్తు పట్టకపోవటం (ఏడాది వయసున్నోడు) మరీ పెద్ద విషయమేమీ కాదు. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన చూస్తే.. ఇక మనమడికి సంబంధించిన బాధ బాబుకు ఉండాల్సిన అవసరం లేదన్న భావన కలుగుతుంది.

తాజాగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మైదానంలో సిలికానాంధ్ర అంతర్జాతీయ కూచిపూడినాట్య సమ్మేళనం జరిగింది. దీనికి 18 దేశాలకు చెందిన కళాకారులు హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ తో పాటు.. మనమడు దేవాన్ష్ కూడా హాజరయ్యారు. ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ కి ఈ కాంబినేషన్ లో రావటం ఇదే తొలిసారనే చెప్పాలి.

దేవాన్ష్ రెండు చేతుల్ని చేరోవైపు చంద్రబాబు.. చినబాబు పట్టుకొని నడిపించుకురావటం.. బుడ్డోడు బుజ్జి బుజ్జిగా అడుగులు వేస్తూ రావటం అందరి దృష్టిని ఆకర్షించింది. తండ్రి చేతిని ఎంతలా పట్టుకున్నాడో.. తాత చంద్రబాబు చేతిని అదే రీతిలో పట్టుకున్న తీరు చూస్తే.. దేవాన్ష్ తాతను గుర్తు పట్టేస్తున్నట్లు అర్థమవుతుంది. సో.. మనమడికి సంబంధించిన దిగులు చంద్రబాబుకు లేనట్లేనని చెప్పొచ్చేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/