Begin typing your search above and press return to search.
ఏపీ రాజకీయ కూటమిలో కుమార్ స్వామి వేలు
By: Tupaki Desk | 1 Sep 2018 5:54 PM GMTమీకు పుణ్యం ఉంటుంది. నన్ను ఇన్‌వాల్వ్ చేయకండి... ఇది పాత మాట. స్వామి గారూ.... కాస్త ఇన్‌వాల్వ్ కండి... ఇదీ నేటి మాట. ఇంతకీ ఎవరీ స్వామి... ఎందులో తలదూరుస్తున్నారు అనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదు... కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. దేంట్లో తలదూరుస్తున్నారు అనుకుంటున్నారా... ఇంక దేంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, కాంగ్రెస్ పార్టీకి నిశ్చితార్ధం చేసేందుకే కుమారస్వామి బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చారంటున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయంపై కనీస నమ్మకం కూడా లేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది ముందు నుంచే పొత్తులు... ఎత్తులు... వ్యూహాలు... ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు చంద్రబాబు నాయుడు తహతహలాడతున్నారు. అయితే, తానే ముందుగా పొత్తు కోసం కాంగ్రెస్‌తో మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని చంద్రబాబు నాయుడి ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తానంత తానుగా వారితే కలిస్తే ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనేది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ముందుగా అటు వైపు నుంచి ప్రతిపాదన వస్తే దానిపై ఆలోచించవచ్చుననేది చంద్రబాబు నాయుడి ఎత్తుగడగా చెబుతున్నారు.
కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కలిసారు. వీరిద్దరూ దాదాపు 45 నిమిషాల సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీతో చర్చకు సంబంధించిన అంశంపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ తెలుగుదేశం పార్టీపై పొత్తు విషయం చంద్రబాబు నాయుడితో మాట్లాడాలని, దీన్ని ఎలాగైనా సాధ్యం చేయాలని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి అప్పగించినట్టు చెబుతున్నారు. గతంలో తన తండ్రి దేవెగౌడ ప్రధాని కావడానికి చంద్రబాబు నాయుడే కారణమని, ఆ పరిచయంతో ఈ పని పూర్తి చేయాలని కూడా సూచించినట్లు సమాచారం. మరోవైపు తనను కలిసేందుకు వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రితో గంటకు పైగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో స్నేహం ఎలా ఉంది... వారి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా అని ఆరా తీసినట్లు చెబుతున్నారు. మొత్తానికి బద్ధ శత్రువులైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని ఇరు పార్టీలు పావులుగా వాడుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.