Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ లో ఏముంది.?
By: Tupaki Desk | 24 Jan 2019 12:10 PM GMTచంద్రబాబు మార్క్ రాజకీయాలు చాలా అడ్వాన్స్ గా ఉంటాయి. తనకున్న పరిజ్ఞానానికి తోడుగా టెక్నికల్ సపోర్ట్ తీసుకుంటారు ఆయన. ఏ విషయంపై అయినా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే తన మంత్రివర్గ సహచరుల్ని - పార్టీ సీనియర్ నాయకుల్ని అడుగుతారు. వాళ్ల అభిప్రాయాలు తీసుకుంటారు. కానీ ఫైనల్ డిసిషన్ మాత్రం ఆయనే తీసుకుంటారు. దీంతోపాటు.. కొన్ని ఇంటెజిజెన్స్ సర్వేలు - సీక్వెల్ సర్వేలు కూడా వ్యక్తిగతంగా తెప్పించుకుంటారు. రాబోయే ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు ఇవ్వాలా వద్దా - ఇస్తే ఎవరికి ఇవ్వాలి - ఎవరిని తప్పించాలి అనే విషయాలపై చంద్రబాబు దగ్గర రిపోర్ట్ సిద్ధంగా ఉన్నదట. ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ ప్రకారమే... అభ్యర్థులకు సీట్లు ఇవ్వబోతున్నారట చంద్రబాబు.
చంద్రబాబు దగ్గరున్న ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం.. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల పరిస్థితి చాలా ఘరోంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు.. చంద్రబాబు సొంతంగా చేసుకున్న సర్వే ఫలితాలు కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉన్నాయని సమాచారం. దీంతో.. ఎన్నికలు అంటేనే చంద్రబాబు భయపడిపోతున్నారట. అందుకే ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా సమావేశం అవుతున్నారు. ఒకవేళ ఒక ఎమ్మెల్యేకు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ మార్కులు బాగా తక్కువుగా వచ్చి ఉంటే... నిర్మోహమాటంగా పార్టీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారట చంద్రబాబు. మరోవైపు కాస్త ఫర్వాలేదు అని రిపోర్ట్ వచ్చిన ఎమ్మెల్యేలకు మరింతగా కష్టపడాలని - ఈ నాలుగు నెలలు నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారట. ఒక్క బుధవారమే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలతో చంద్రాబాబు మాట్లాడారు. ఈ 15 మందికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ వచ్చే అవకాశాలే లేవని సమాచారం. వీటితో పాటు ఎమ్మెల్యేల పనితీరు - నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు - స్థానిక నాయకులతో సంబంధాలు ఎలా ఉన్నాయి అనే విషయాల్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటున్నారని సమాచారం.