Begin typing your search above and press return to search.
జగన్ ఢిల్లీ పర్యటన బాబెంత వర్రీ అంటే..
By: Tupaki Desk | 9 April 2017 5:35 AM GMTనిత్యం నీతులు చెప్పే పెద్దమనిషికి.. అలాంటి అవకాశం మిస్ అయితే.. ఎంత ఇబ్బందిగా ఉంటుంది? చెప్పే మాటలకు.. చేసే పనులకు సంబంధం లేనట్లుగా వ్యవహరించే తీరు దశాబ్దాల నుంచి ఫాలో అవుతున్న చంద్రబాబు లాంటి పెద్దమనిషికి.. తన గుట్టును తాజాగా జాతీయస్థాయిలో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం బట్టబయలైంది. తన లోపలి వేదనను.. ఫస్ట్రేషన్ ను బాబు బయటపెట్టుకున్న తీరు చూస్తే.. బరితెగింపును ఆయన ఎంతగా సర్ది చెప్పుకుంటున్నారన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.
అడ్డదిడ్డంగా మాట్లాడేయటమే కాదు.. తనను తాను సమర్థించుకుంటున్న వైనం చూస్తే.. బాబు చేసే తప్పులన్నీ ఒప్పులుగా.. ఎదుటోళ్లు చేసేవి మాత్రమే తప్పులుగా చెప్పుకునే తీరు చూస్తే అవాక్కవాల్సిందే. బాబు చెప్పిన మాటల్ని యథాతదంగా తీసుకొని.. ఆయన మాటల్నిచూస్తూ.. తార్కికంగా ప్రశ్నిస్తే.. అసలు విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రిపదవులు ఇచ్చిన వైనాన్ని జాతీయ స్థాయిలో జగన్ ఎండగట్టిన తీరు బాబులో బ్యాలెన్స్ మిస్ అయ్యేలా చేసిందని చెప్పాలి. ఇంతకీ బాబు ఏమన్నారు? దానిపై సగటు జీవికి వచ్చే సందేహాన్ని చూస్తే.. బాబు మాటల్లో పస ఎంతో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
బాబు మాట: జాతీయ స్థాయిలో ఫిరాయింపులపై డిబేట్ చేయాలనడటానికి నీ స్థాయి ఏంటి? ఈ వ్యక్తి ప్రవర్తన ఏంటి? నీతి నిజాయితీ ఏంటి?
సామాన్యుడి సందేహం: తప్పును తప్పు అని చెప్పటానికి స్థాయి అవసరం ఉందా? అన్నది అసలు ప్రశ్న. అంటే.. ఒక ప్రధానిని నిలదీయాలంటే మరో ప్రధాని మాత్రమే నిలదీయాలా? అది అసలు సాధ్యమయ్యే పనేనా? స్థాయిలన్నవి ఎవరు సృష్టించేవి? మనం అనుకుంటే స్థాయిలు వచ్చేయటం.. మనం అనుకోకుంటే మాయమయ్యే స్థాయిలు కూడా ఒక స్థాయిలేనా? జాతీయ స్థాయిలో ఫిరాయింపులపై డిబేట్ చేయటానికి జగన్ స్థాయి ఏమిటని ప్రశ్నిస్తున్న చంద్రబాబు.. ఈ మాటలు అనటానికి ఆయనకున్న స్థాయి ఏమిటి? అన్న ప్రశ్నకు ఆయనేం సమాధానం చెబుతారు. తన తప్పును వేలెత్తి చూపిస్తున్న వ్యక్తి ప్రవర్తన ఏంటి? నీతి నిజాయితీలు ఏమిటని ప్రశ్నిస్తున్న చంద్రబాబు.. తప్పు చేసిన వ్యక్తిని తప్పు చేశారని చెప్పటానికి.. రాజ్యాంగం కానీ.. చట్టం కానీ ఎవరెలా ఉండాలన్న విషయాన్నిఎక్కడైనా కోట్ చేశారా?
బాబు సంధిస్తున్న ప్రశ్నలకు ముందే బాబు మిస్ అయిన పాయింట్ ఏమిటంటే.. ఇవన్నీ ఆలోచించి కోట్లాది మంది వేసిన ఓట్లతో జగన్ ను ఏపీ ప్రతిపక్ష నేతగా ఎంపిక చేశారన్న అసలు విషయాన్ని బాబు ఎందుకు మిస్ అవుతున్నారు?
బాబు మాట: ఒక ఆర్థిక నేరస్తుడు ఢిల్లీకి వెళ్లి.. చట్టాలు.. రాజ్యాంగం గురించి మాట్లాడితే అపహాస్యంగా ఉంది
సామాన్యుడి సందేహం: ఒక రాష్ట్రాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా.. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఇంత బరితెగింపు మాటా? తప్పు చేశారని.. చేసిన తప్పునుఎత్తి చూపిస్తే.. అన్నేసి మాటలు అంటున్న వైనం చూస్తే.. బాబులోని బరితెగింపు ఏస్థాయికి వెళ్లిందో ఇట్టే అర్థమవుతుంది. సింఫుల్ గా ఒకే ఒక్క ప్రశ్న. నిత్యం జగన్ ను ఆర్థిక నేరస్తుడన్న మాటను ప్రస్తావించే చంద్రబాబు మర్చిపోతున్న అసలు విషయం.. ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసి.. అతడి మీద కేసులు వేసిన వెంటనే నేరస్తుడు అయిపోడన్న కనీసం ఇంగితం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేకపోవటం గమనార్హం. నేరం నిరూపితం కానంతవరకూ అతడ్ని నిందితుడిగానే వ్యవహరించాలే తప్పించి.. నేరస్తుడిగా అభివర్ణించటం చట్ట వ్యతిరేకమన్న కనీస విషయం బాబుకు తెలీకపోవటం ఏంటి?
బాబు మాట: ప‌్రధాని మోడీపై నమ్మకంతో ఎంతో మంది బీజేపీలో చేరుతున్నారు. అలానే నాపై నమ్మకంతో టీడీపీలోకి వస్తున్నారు
సామాన్యుడి సందేహం: వైఎస్ హయాంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్ని తీసుకోలేదా? అని అడుగుతున్న బాబు.. తాను అంతకు మునుపు చెప్పినట్లుగా.. వైఎస్ పై నమ్మకంతోనే పార్టీలో చేరినట్లుగా ఎందుకు అనుకోరు? బీజేపీలోకి ఇతర పార్టీల వారు చేరుతున్నారన్న మాటను చెప్పటం ద్వారా.. తానేం తప్పు చేయటం లేదన్న ఆత్మరక్షణ వాదనను వినిపించిన చంద్రబాబు.. అలా వచ్చి చేరిన వారికి రాజ్యాంగ విరుద్ధంగా మంత్రిపదవులు కట్టబెట్టలేదన్న విషయాన్ని బాబు ఎందుకు మర్చిపోతారు? అంతేనా.. వైఎస్ హయాంలోనూ.. ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టలేదన్న విషయాన్ని ఎందుకు గుర్తుకు రాదు?
బాబు మాట: రాజ్యాంగం ప్రకారం.. ఎవరినైనా కేబినెట్‌లోకి తీసుకునే హక్కు ముఖ్యమంత్రికి ఉంది
సామాన్యుడి సందేహం: అదే నిజమని అనుకుందాం. మరి.. తెలంగాణలో టీటీడీపీ ఎమ్మెల్యేని తన పార్టీలో చేర్చుకొని మంత్రి పదవిని ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆ రంగా ఎందుకు మాటలు అన్నట్లు? చివరకు ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత జగన్ కూడా ప్రస్తావించి.. కేసీఆర్ ను విమర్శించాలని నిండు అసెంబ్లీలో కోరిన విషయాన్ని బాబు ఎందుకు మర్చిపోతారు? తాను చెప్పినట్లుగా.. కేబినేట్ లో ఎవరినైనా తీసుకునే హక్కు సీఎంకు ఉన్నప్పుడు.. అదే మాట మీద నిలబడాలని చంద్రబాబు ఫీల్ అయినప్పుడు.. కొద్ది నెలల కిందటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తలసానిని మంత్రిగా చేసినప్పుడు ఎందుకంతలా ఫీల్ అయినట్లు? (ఒకవేళ ఆ విషయాన్ని మర్చిపోతే.. యూట్యూబ్ లో చూస్తే చంద్రబాబు అన్న మాటలు మళ్లీ వినేసే.. చూసేసే వీలుంది సుమా)
బాబు మాట: జగన్ ప్రవర్తన నచ్చకే అభివృద్ధి కోసం టీడీపీలో చేరుతున్నారు.
సామాన్యుడి సందేహం: అదే నిజమని అనుకుందాం. అలాంటప్పుడు వైఎస్ హయాంలో ఆయన పార్టీలో చేరిన ఎమ్మెల్యేలంతా వైఎస్ చేసే అభివృద్ధి నచ్చే చేరారని చంద్రబాబు ఎందుకు అనుకోరు? తాను చెప్పే మాటలనే.. బాబు తనకు అప్లై చేసుకోరెందుకు?
బాబు మాట: ‘ప్రపంచంలో ఎక్కడికెళ్లినా.. మీ ప్రతిపక్షం ఎవరని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? వారం వారం కోర్టుకు వెళతాడని చెప్పాలా?
సామాన్యుడి సందేహం: బాబు మాటకు సమాధానం.. గతంలో బాబు చెప్పిన విషయాన్నే ప్రస్తావిద్దాం. తనపై పలుమార్లు కేసులు వేశారని.. అవేమీ నిలబడలేదని చెబుతుంటారు. తన మాదిరే జగన్ మీద కూడారాజకీయ కారణాలతో కేసులు వేసిన వైనాన్ని ఆయన ఎందుకు అర్థం చేసుకోరు? తన మాదిరే రేపొద్దున కేసులు ఏమీ నిలబడకపోవచ్చు. తనపై కేసులు ఉన్న వేళలో.. బాబు కోర్టుకు వెళ్లి రాలేదా? ఆ మాటకు వస్తే.. మోడీ మీద కూడా సవాలచ్చ ఆరోపణలు ఉండేవి. అంతమాత్రాన మోడీ మీద ఉన్న ఆరోపణల్ని.. కేసులు ఉన్నంత మాత్రాన ఆయన్ను నేరస్తుడిగా అభివర్ణించలేం కదా? చూస్తుంటే.. కోర్టుకు వెళ్లి రావటం కూడా తప్పన్నట్లుగా చెబుతున్న చంద్రబాబు.. తన రాజకీయ జీవితంలో కోర్టుకు వెళ్లలేదా? మరి.. ఆ విషయం గురించి ఎవరైనా అడిగితే.. బాబు గురించి జనం ఫీల్ అవ్వాలా? వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యుడిగా.. సొంతమామనే వెన్నుపోటు పొడిచిన వైనం గురించి అడుగుతున్న మాటలకు.. కొన్నేళ్లుగా తెలుగు ప్రజలకు తల కొట్టేసినట్లుంది. అందుకు చంద్రబాబు ఏమని బదులిస్తారు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/