Begin typing your search above and press return to search.

తెలుగు నేల‌పై చంద్ర‌బాబు పేరు శాశ్వ‌తం.. శివాజీ సంచ‌ల‌న కామెంట్లు

By:  Tupaki Desk   |   6 March 2022 7:43 AM GMT
తెలుగు నేల‌పై చంద్ర‌బాబు పేరు శాశ్వ‌తం.. శివాజీ సంచ‌ల‌న కామెంట్లు
X
టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పేరును ఎవ‌రో తుడిచేయాల‌ని అనుకున్నా సాధ్యం కాద‌ని, ఆ పేరును ఎవ‌రో చెరిపేయాల‌న్నా.. చెరిపేయ‌లేర‌ని.. న‌టుడు శివాజీ వ్యాఖ్యానించారు. తెలుగు చ‌రిత్ర ఉన్నంత వ‌ర‌కు.. రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నంత వ‌ర‌కు చంద్ర‌బాబుపేరు చిర‌స్థాయిగా ఉంటుంద‌న్నారు.

ఓ టీవీ డిబేట్‌లో మాట్లాడిన శివాజీ.. ఏపీలో భూముల కోసం అక్క‌డి ప్ర‌భుత్వం అరాచ‌కానికి పాల్ప‌డుతోంద‌ని అన్నారు. దీనికి కార‌ణం.. ఆయా భూముల ధ‌ర‌లు పెర‌గ‌డ‌మేన‌ని చెప్పారు. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబేన‌ని వెల్ల‌డించారు.

అదేవిధంగా హైద‌రాబాద్ ఈ రోజు అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంద‌న‌డానికి కూడా చంద్ర‌బాబు కార‌ణ‌మ‌ని తెలిపారు. కులికుతుబ్‌షాలు, నైజాంలు హైద‌రాబాద్‌ను పాలించి అభివృద్ధి చేసినా.. చంద్ర‌బా బు హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని.. శివాజీ చెప్పారు.
అంతేకాదు.. సంప‌ద సృష్టిలోనూ.. చంద్ర‌బాబును మించిన నాయ‌కుడు లేడ‌ని అన్నారు. ఈ విష‌యాన్ని సాక్షాత్తూ తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కూడా ఒప్పుకొన్నార‌ని.. ఇది చ‌రిత్ర అని ఎవ‌రు తుడిచేయాల‌ని అనుకున్నా.. సాధ్యం కాద‌ని చెప్పారు.

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ముందు .. చంద్ర‌బాబు ఉన్నారు.. త‌ర్వాత కూడా ఉంటార‌ని.. ఆయ‌న పేరు శాశ్వ‌త మ‌ని వెల్ల‌డించారు. గ‌తంలో తాను కూడా చంద్ర‌బాబును కొన్సి సంద‌ర్భాల్లో విమ‌ర్శించాన‌ని.. అయితే.. అవ‌న్నీ.. రాజ‌కీయ విమ‌ర్శ‌లేన‌ని చెప్పారు. కానీ, పాల‌న ప‌రంగా చూసుకుంటే.. ఆయ‌న చేసిన అభివృద్ధిని ఎవ‌రూ విస్మ‌రించ‌లేర‌ని అన్నారు.

తాను 1993లో హైద‌రాబాద్‌కు వ‌చ్చి ఫిలింన‌గ‌ర్‌లో ఉన్న‌ప్పుడు గ‌జం భూమి రెండు వేలు ఉంటే.. ఇప్పుడు రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు చేరింద‌ని.. ఇది చంద్ర‌బాబు వ్యూహం కాదా? అని ప్ర‌శ్నించారు.

హైద‌రాబాద్ త‌ర‌హాలోనే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని అభివృద్ధి చేయాల‌ని క‌ల‌లు క‌న్నార‌ని.. శివాజీ తెలిపారు. అంతేకాదు.. సంప‌ద సృష్టించే న‌గ‌రంగా దానిని అభివృద్ధి చేయాల‌ని.. చంద్ర‌బాబు భావించార‌ని అన్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో చాలా మందికి చంద్ర‌బాబు పెట్టిన రాజ‌కీయ భిక్షేకార‌ణ‌మ‌ని శివాజీ చెప్పారు. చంద్ర‌బాబు నాయుడు భార‌త దేశానికి ల‌భించిన ఒక అద్భుత‌మైన వ్య‌క్తి అని శివాజీ స్ప‌ష్టం చేశారు.