Begin typing your search above and press return to search.

అదే ఊపు.. చంద్ర‌బాబు వైపు.. నెల్లూరులో ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   28 Dec 2022 2:30 PM GMT
అదే ఊపు.. చంద్ర‌బాబు వైపు.. నెల్లూరులో ఏం జ‌రిగిందంటే!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైపు ప్ర‌జ‌లు చూస్తున్నారంటూ.. ఆ పార్టీ నేత‌లు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. దీనిని వైసీపీ నాయ‌కులు, మాజీ మంత్రి కొడాలి నాని విమ‌ర్శించారు. చిన్న చిన్న గ‌ల్లీల్లో స‌భ‌లు పెట్టుకుని వంద‌మందిని వెయ్యి మందిగా ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలిలో జ‌రిగిన స‌భ‌ల్లో జ‌నాలు భారీగానే త‌ర‌లి వ‌చ్చారు. స‌రే.. ఆ విష‌యంలో వ‌చ్చిన విమ‌ర్శ‌లు నిజ‌మే అనుకున్నా.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్పీప్ చేసిన నెల్లూరు జిల్లాలో నూ ఇప్పుడు బాబుకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మ‌రి దీనికి ఏమంటారో చూడాలి.

నెల్లూరు జిల్లాలో మూడు రోజుల‌ ప‌ర్య‌ట‌న నిమిత్తం చంద్ర‌బాబు బుధ‌వారం అక్క‌డకు వెళ్లారు. ఈ క్ర‌మంలో కీల‌క ప్రాంత‌మైన‌ సింగరాయకొండలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. సింగరాయకొండ బైపాస్(పేద్ద రోడ్డు) నుంచి బైక్ ర్యాలీగా చంద్రబాబు కందుకూరుకు బయలుదేరారు. కందుకూరులో జరగనున్న'ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి' బహిరంగ సభకు హాజరయ్యారు. అంతకుముందు సింగరాయకొండ చేరుకున్న బాబు.. అండర్ పాస్ వద్ద టీ స్టాల్‌లో టీ తాగారు.

అక్కడ చిరు వ్యాపారులతో ముచ్చటించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్నామని చంద్రబాబుకు టీస్టాల్‌ నిర్వాహకురాలు తెలిపారు. దీనికి ముందు నెల్లూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన చంద్రబాబుకు దారి పొడవునా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు స్వాగతం పలికారు. కొండెపి టోల్‌గేట్ వద్ద దామచర్ల సత్య భారీ గజమాలతో స్వాగతోత్సవ ఏర్పాట్లు చేశారు. ఎటు చూసినా.. ప‌చ్చ తోర‌ణాలే క‌నిపించాయి. భారీ క‌టౌట్లు ద‌ర్శ‌న మిచ్చాయి. సో.. మొత్తానికి.. అదే ఊపు.. చంద్ర‌బాబు వైపు.. అన్న‌ట్టుగా ఈ ప‌ర్య‌ట‌న కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.