Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు పోరు .. న్యూ లుక్ లో చంద్రబాబు అదిరిపోయే ఎంట్రీ !

By:  Tupaki Desk   |   17 Feb 2021 12:45 PM GMT
విశాఖ ఉక్కు పోరు .. న్యూ లుక్ లో చంద్రబాబు అదిరిపోయే ఎంట్రీ !
X
టీడీపీ అధినేత , ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత అనుభవం కలిగిన రాజకీయ నేత. అనేక వేసే వ్యూహాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. రాజకీయాల్లో అపరచాణిక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు పలు రాజకీయ విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ తన డ్రెస్సింగ్ స్టైల్ లో మాత్రం ఏ మార్పు ఉండకుండా చూసుకుంటారు. యూనిఫారం మాదిరి ఒకేలాంటి దుస్తుల్ని ఆయన ధరిస్తుంటారు. పార్టీ రంగు అయిన పసుపుకు చాలా లైట్ గా ఉంటే పసుపు.. గోధుమ రంగులో ఉంటే ఫ్యాంట్ షర్టు వేసుకోవటం ఆయనకు మొదటి నుండి అలవాటు. ఎవరైనా చంద్రబాబును గుర్తుకు చేసుకున్నా కూడా అయన రూపం కళ్ల ముందు అదే విధంగా కనిపిస్తుంది.

అలాంటి చంద్రబాబు తాజాగా విశాఖ పర్యటనకు రావటం తెలిసిందే. ఆంధ్రోళ్ల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు అమ్మేయాలని నిర్ణయించిన నేపథ్యంలో దానిపై పోరాడేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన సరికొత్త లుక్ తో ప్రత్యేకంగా కనిపించారు.

రోజుటి మాదిరి కాకుండా కొంచెం భిన్నంగా ఆయన ఫ్యాంట్ ,చొక్కా రంగులు మారిపోయాయి. కొట్టొచ్చినట్లుగా కనిపించే మార్పు బాబులో కనిపించటం గమనార్హం. దీనికి తోడు ముఖానికి పెద్ద బొట్టు పెట్టుకున్న ఆయన ఈ రోజు కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు అని చెప్పాల్సిందే. ఎప్పుడూ ఒకేలాంటి డ్రెస్సులో కనిపించే చంద్రబాబు తాజాగా మాత్రం అందుకు భిన్నంగా దర్శనమివ్వటం విశేషం. నేటి టూర్ లో చంద్రబాబు డ్రెస్సింగ్ స్టయిల్ పై తెలుగు తమ్ముళ్ల కూడా చర్చలు జరుపుతున్నారు.