Begin typing your search above and press return to search.
టాలీవుడ్ + టీడీపీ = చంద్రబాబు వ్యూహం?
By: Tupaki Desk | 26 Oct 2022 4:13 AM GMTరాజకీయాలకు-సినీ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఎన్నికలు అనగానే రాష్ట్రంలో రాజకీయ నాయకులు.. వెంటనే టాలీవుడ్‌పై దృష్టి పెడతారు.. ఎవరు తమకు మద్దతు గా ఉంటారు.. ఎవరు తమకు అనుకూలంగా ప్రజలకు సంకేతాలు ఇస్తారు..? అనే విషయాలపై కన్నేస్తారు. గత ఎన్నికల్లో అయినా.. అంతకుముందు ఎన్నిక లైనా.. పార్టీలకు సినిమా హీరోలు.. క్యారెక్టర్ నటులు కూడా అండగా ఉన్నారు. టీడీపీని తీసుకుంటే.. ఏకంగా బాలయ్య కుటుం బం పార్టీలోనే ఉంది.
నేతల పరంగా కూడా.. టీడీపీలో కొందరు సినీ తారలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. సూపర్ స్టార్ మహేష్ మద్దతు తీసుకున్నారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.. అప్పటి అక్కినేని కోడలు సమంత నుంచి మద్దతు కోరారు.
వారు సక్సెస్ కూడాఅయ్యారు.ఇక, వైసీపీ విషయాన్ని తీసుకుంటే.. క్యారెక్టర్ నటులు చాలా మంది ఈ పార్టీ తరపున ఏకంగా ప్రచారం చేశారు. మోహన్‌బాబు కూడా వైసీపీకి అండగా ఉన్నారు. ఇలా.. సినీ రంగంతో తెలుగు రాజకీయ రంగం పెనవేసుకుపోయింది.
ఇక, వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులు కోవాలని భావించడం లేదు. ఈ క్రమంలోనే ఆయన ఎప్పుడూ లేని విదంగా టాలీవుడ్‌లో జరిగిన సంబరానికి హాజరయ్యారు. బాలయ్య అన్ స్టాపబుల్ మూవీ.. ఫంక్షన్‌కు చంద్రబాబు కుమారుడితో సహా హాజరయ్యారు. నిజానికి చంద్రబాబు సినిమాలపై పెద్దగా దృష్టి లేదు. ఆయన ఎప్పుడూ.. సినిమాలు చూసిన సమయం కూడా లేదు.
అంతేకాదు.. ఎ ప్పుడూ. ఏ సినీ ఫంక్షన్‌లోనూ మెరవలేదు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. రాజకీయాలు.. వ్యూహా లు.. ప్రజలు.. పాలన అంటూ.. చంద్రబాబు ప్రతి నిముషం కూడా.. వారితోనే బిజీగా ఉంటారు. అలాంటి బాబు ఒక్కసారిగా బాల య్య పంక్షన్‌కు హాజరుకావడం వెనుక.. టాలీవుడ్‌ను తనవైపు తిప్పుకొనే వ్యూహం ఏమైనా ఉందా? అనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా సాగుతోంది. దీనికి బాలయ్య ప్రోద్బలం కూడా ఉందని అంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్.. ఏపీ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైపు చూసే అవకాశం ఉందని.. అయితే.. ఒక అడుగు తాను కూడా.. ముందుకు వేస్తే..మరింతగా కెమిస్ట్రీ కుదురుతుందని చంద్రబాబు భావించినట్టు తెలుస్తోందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.