Begin typing your search above and press return to search.
ప్లీనరీకి కౌంటర్ : టైమూ టైమింగ్ అదిరిందిగా చంద్రం...?
By: Tupaki Desk | 8 July 2022 3:40 PM GMTచంద్రబాబు చాణక్యున్ని చంపి పుట్టారు అని అంటారు అంతా. దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇక లెటెస్టుగా చూస్తే ఒక వైపు పార్టీ ఘోర పరాజయం. మరో వైపు వయోభారం. ఇంకో వైపు సైలెంట్ అయిన లీడర్స్. అధికార వైసీపీ దూకుడు ఇంకో వైపు ఇలా సమస్యలు అన్నీఒక్కసారిగా పద్మవ్యూహంలా చుట్టుముట్టినా కూడా బాబు లాంటి నాయకుడు ఒక్కరు ఉంటే చాలదా టోటల్ ఏపీ పొలిటికల్ సీన్ ని రివర్స్ చేయడానికి అని చెప్పాలేమో. మూడేళ్ళు తిరగకుండానే ఏపీ జనాల మూడ్ బాబు మార్చేశారు అంటే నిజంగా గ్రేటో గ్రేట్ అనాల్సిందే.
వైసీపీ అయిదేళ్ళ తరువాత ప్లీనరీ నిర్వహిస్తోంది. పైగా అధికారంలో ఉన్న పార్టీ. అన్ని హంగులూ అందుబాటులో ఉంటాయి. దాంతో ఎలాగో ఒకలా చేసి జనమంతా తమవైపే అని చెప్పుకునే వెసులుబాటు వేయి రెట్లు ఆ పార్టీకి ఉంది. అయినా సరే చంద్రబాబు అసలు ఎక్కడా తగ్గలేదు. చలో రాయలసీమ అంటూ సరిగ్గా ప్లీనరీ టైమ్ లోనే వైసీపీ కంచుకోటలలో టూర్లు మొదలెట్టారు.
ఆయన మదనపల్లిలో స్టార్ట్ చేసి వైసీపీ మంత్రి రోజా ఇలాకా నగరిలో మీటింగ్స్ కంటిన్యూ చేశారు. మదనపల్లిలో రాత్రి పూట వానలో కూడా జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఇక నగరిలో చూసినా సేమ్ సీన్. అక్కడ కూడా జనమే జనంగా బాబు టూర్ సాగిపోయింది. బాబు జగన్ సర్కార్ మీద ఏ విమర్శ చేసిన జనం నుంచి మంచి రియాక్షన్ వస్తోంది అంటే ఏమనుకోవాలని అంటున్నారు అంతా.
ఇక ప్లీనరీలో షరా మామూలు ప్రసంగాలతో వైసీపీ నేతలు బోరెత్తిస్తూంటే బాబు చెడుగుడు ఆడుతూ సీమ జిల్లాల్లో చెలరేగుతున్నారు. ఆయన విజయమ్మ రాజీనామాను కూడా వదలలేదు. తల్లిని చెల్లెలుని పార్టీ నుంచి పంపేసిన జగన్ కి స్వార్ధం తప్ప మరేమీ తెలియదు అని నిప్పులే చెరిగారు పార్టీకి తానే శాశ్వత ప్రెసిడెంట్ గా ప్రకటించుకోవడం జగన్ నియంతృత్వానికి నిదర్శనం అని కూడా బాబు చాకిరేవు పెట్టేస్తున్నారు.
మొత్తానికి మంచి టైమ్ లో అదిరిపోయే టైమింగ్ తో బాబు సీమ జనాలను తన వైపు తిప్పుకుంటూ జగన్ కంచుకోటల్లో పసుపు కళను తెచ్చేస్తున్నారు. మహానాడు ఒక వైపు జరుగుతూంటే మంత్రుల బస్సు యాత్రను వైసీపీ చేయించింది అన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా మహానాడుకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు ప్లీనరీ జరుగుతూంటే బాబు జనాలకు పెద్ద ఎత్తున జనాలు రావడం అంటే అదిరిందిగా చంద్రం నీ వ్యూహం అనిపించక మానదుగా.