Begin typing your search above and press return to search.
తల్లితండ్రులకు బాబు పిండప్రధానం..
By: Tupaki Desk | 13 Aug 2016 12:48 PM GMTమరణించిన తమ పూర్వికులకు పుష్కరాల్లో పిండప్రదానం చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తమ పూర్వికులకు పిండప్రదానం చేశారు. అయితే ఈ పుష్కరాల్లో తన తల్లితండ్రులతో పాటు, అత్తమామలకు కూడా చంద్రబాబు పిండప్రదానం చేయడం విశేషం. కృష్ణా పుష్కరాల్లో రెండో రోజైన శనివారం చంద్రబాబు తన పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ - ఖర్జూరనాయుడులతో పాటు - అత్తమామలు నందమూరి తారకరామారావు - బసవతారకం దంపతులకు ఆయన పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని బాబు ప్రార్థించారు.
పిండప్రదాన కార్యక్రమం అనంతరం అధికారులు - సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. పుష్కర స్నానానికి వచ్చే వికలాంగులు - వృద్ధులకు సాయపడాలని - గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలని - యాత్రికులు అందరినీ సంతృప్తిగా పంపాలని స్పష్టం చేశారు. ప్రతిఘాట్ వద్ద వాటర్ లెవల్ ఇండికేటర్లు ఉపయోగించి ప్రతి నిమిషం జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఈ టెలీకాంఫరెన్స్ అనంతరం ఆయన మీడియా మిత్రులకు క్లాస్ తీసుకున్నారు.
కృష్ణా పుష్కరాలపై దుష్ప్రచారం జరుగుతుందని - కృష్ణా జలాలు కలుషితమయ్యే అవకాశం లేనే లేదనే విషయాన్ని మీడియా మరిచిపోకూడదని చంద్రబాబు తెలిపారు. బాధ్యతారాహిత్యంగా ఎవరు వార్తలు రాయొద్దని - అలా రాసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పుష్కరాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్ని మీడియా సంస్థలు మాత్రం పుష్కరాలపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆ మీడియా సంస్థలు హెచ్చరించినట్లు కృష్ణాజలాలు కలుషితమైతే.. శనివారం కూడా స్వామీజీలు - పీఠాధిపతులు పుష్కరస్నానం చేసిన విషయం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.