Begin typing your search above and press return to search.
‘గుడివాడ’ నానికి గురిపెట్టిన చంద్రబాబు?
By: Tupaki Desk | 26 Dec 2020 4:30 PM GMTరాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే, అతి అన్నిటా అనర్థదాయకం అన్నట్టు అతిగా శృతిమించి విమర్శలు చేయడం కొందరు నేతలకు పరిపాటి. ఈ కోవలోనే టీడీపీ నేతలపై వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని వివాదాస్పద రీతిలో విమర్శలు గుప్పిస్తుంటారన్న సంగతి తెలిసిందే.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై నాని చేసే కామెంట్లు జుగుప్సాకరంగా ఉంటాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. గతంలో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాని....ఆ తర్వాత వైసీపీలో చేరి మంత్రి అయ్యారు. మంత్రి అయిన తరువాత నాని మరింత దూకుడు పెంచారు. అయితే, చంద్రబాబు, లోకేష్ ల మీద విరుచుకుపడే కొడాలి నాని....నందమూరి ఫ్యామిలీని పల్లెత్తు మాటనరు. నాని వ్యాఖ్యలను కొందరు టీడీపీ నేతలు ఖండించినా...నాని రేంజ్ లో వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయరు. దీంతో, కొడాలి నాని దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ నేతలు కొత్త వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కొడాలి నాని ఓటమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారట. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా...నానిపై పోటీకి నందమూరి కుటుంబంలోని వ్యక్తిని బరిలోకి దింపాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట.
కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నానికి మంచి పట్టుంది. అక్కడ, నానిని ఓడించాలంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలోకి దింపాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. నానిపై నందమూరి హరికృష్ణ కుమారుడు, సినీ హీరో కళ్యాణ్‌రామ్‌ను పోటీ చేయించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. తన తాత, తండ్రి నుంచి నటనతో రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కల్యాణ్ రామ్...గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. అయితే, హరికృష్ణను రాజ్యసభకు పంపిన చంద్రబాబు ఆయనకు తగినంత ప్రాధాన్యతనివ్వలేదన్న అసంతృప్తి హరికృష్ణ ఫ్యామిలీకి ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. 2014లో కృష్ణా జిల్లాలో పెనమలూరు లేదా నూజివీడు నుంచి పోటీ చేస్తానన్న హరికృష్ణ కోరికను చంద్రబాబు మన్నించలేదని ఆ ఫ్యామిలీ కొంత గుర్రుగా ఉందట. ఒకవేళ కల్యాణ్ రామ్ కాదంటే...నందమూరి సుహాసినిని బరిలోకి దింపాలన్నయోచనలో బాబు ఉన్నారట. కీలెరిగి వాత పెట్టాలన్న రీతిలో నానికి నందమూరి కుటుంబంతో చెక్ పెట్టాలన్న బాబు ఆలోచన ఆచరణలోకి వస్తుందా....ఒకవేళ వస్తే వర్కవుటవుతుందా అన్నది తేలాల్సి ఉంది.