Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు కంటత‌డి.. శ‌ప‌థం.. త్వ‌ర‌లోనే ప్ర‌జా దీవెన యాత్ర‌

By:  Tupaki Desk   |   19 Nov 2021 10:34 AM GMT
చంద్ర‌బాబు కంటత‌డి.. శ‌ప‌థం.. త్వ‌ర‌లోనే ప్ర‌జా దీవెన యాత్ర‌
X
టీడీపీ అధినేత, మూడు సార్లు ముఖ్య‌మంత్రి, ఏడు సార్లుగా ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి న చంద్ర‌బాబుకు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితి వ‌చ్చింది. ఏకంగా ఆయ‌న క‌న్నీరు పెట్టేలా ప‌రిస్థితులు మారిపోయాయి. ఈ రోజు జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో.. వైసీపీ మంత్రులు కొంద‌రు రెచ్చ‌గొట్టే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇంటి స‌భ్యుల‌ను అస‌భ్యక‌రంగా మాట్లాడారు. ముఖ్యంగా చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రిని సైతం స‌భ‌లో అన‌రాని మాట‌లు అన్నార‌ని.. టీడీపీ నేత‌లు తెలిపారు.

ఈ క్రమంలో.. త‌న‌ను ఎన్ని అన్నా.. స‌హించాన‌ని.. రాజ‌కీయాల కోసం.. ప్ర‌జ‌ల‌కోసం.. త‌ను రెండున్నరే ళ్లుగా మాట‌లు ప‌డ్డాన‌ని.. చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. భావోద్వేగాన్ని తట్టుకోలేక‌.. కంట త‌డి పెట్టారు. అంతేకాదు.. స‌భ‌లో తీవ్ర‌మైన శ‌ప‌థం చేశారు. తాను మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాతే.. స‌భ‌లో అడుగు పెడ‌తాన‌ని అన్నారు. ఆ వెంట‌నే స‌భ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కూడా ఆయ‌న క‌న్నీరు పెట్టుకున్నారు. గౌర‌వ స‌భ కాదు.. కౌర‌వ స‌భ అంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శించారు. ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే.. ఇక్క‌డే గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో జ‌రిగిన ఒక విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. అప్ప‌ట్లో విప‌క్షంలో ఉన్న వైసీపీ నుంచి చంద్ర‌బాబు.. 23 మంది ఎమ్మెల్యేల‌ను తీసుకున్నారు. పార్టీ కండువాలు క‌ప్పారు. మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. అంతేకాదు.. జ‌గ‌న్‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టారు. ఇదంతా కూడా చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే సాగింది. దీంతో ఈ తిట్లు భ‌రించ‌లేక‌.. జ‌గ‌న్ అప్ప‌ట్లో అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌జల ద‌గ్గ‌ర‌కే వెల్లి.. ముఖ్యమంత్రి అయిన త‌ర్వాత‌.. వ‌స్తాన‌ని శ‌ప‌థం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేశారు.

సుదీర్ఘ ల‌క్ష్యం పెట్టుకుని, అసెంబ్లీలో కాలు పెట్ట‌కుండా.. పాద‌యాత్ర చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల దీవెన‌ల‌తో భారీ విజ‌యం ద‌క్కించుకున్నారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎవ‌రూ సాధించ‌ని మెజారిటీ ద‌క్కించుకుని 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అదే శ‌ప‌థం చేశారు. ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాతే.. అసెంబ్లీలోకి వ‌స్తాన‌ని.. ఆయ‌న శ‌ప‌థం చేశారు. అయితే.. త్వ‌ర‌లోనే ఒక నిర్ణ‌యం తీసుకుని.. జ‌గ‌న్‌ను ఎండ‌గట్టే.. కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టే అవాశం ఉంది.

దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే ఒక ప్రోగ్రాం చేయొచ్చ‌ని అంటున్నారు. దీనికి ప్ర‌జా దీవెన అనే ప‌పేరుతో పాద‌యాత్ర చేసే ఆలోచ‌న ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ వ‌య‌సు స‌హ‌క‌రించ‌క‌పోతే.. బ‌స్సు యాత్ర చేసే ఆలోచ‌న ఉంది. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆయ‌న పాద‌యాత్ర‌కేమొగ్గు చూపే అవ‌కాశం ఉంది. ఎందుకంటే.. రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు చేస్తున్న పాదయాత్ర స‌క్సెస్ అయింది. ఈ క్ర‌మంలో వ‌య‌సు స‌హ‌క‌రించ‌క‌పోయినా.. పాద‌యాత్ర‌నే చంద్ర‌బాబు ఎంచుకునే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఏపీలో రాజ‌కీయాలు వేడెక్క‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.