Begin typing your search above and press return to search.
చంద్రబాబు విభజన వ్యాఖ్యలు..ఒక్క దెబ్బకు రెండు ప్రయోజనాలు!
By: Tupaki Desk | 22 Dec 2022 4:30 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేసినా..చాలా దూరదృష్టి ఉంటుందని అంటారుకదా! ఇప్పుడు రాజకీ యంగా కూడా ఆయన దూరదృష్టితోనే ముందుకు సాగుతున్నారనే తాజాగా ఆయనచేసిన కామెంట్లు ఉన్నాయి. ఖమ్మంలో నిర్వహించిన సభలో చంద్రబాబు ఒకింత ఆలోచనాత్మకంగా.. అదేసమయంలో ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసేలా కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఏపీ విభజన అంశాన్ని ఆయన అనూహ్యంగా ప్రస్తావించారు.
ఇప్పటికే విభజన పూర్తయిన రెండు రాష్ట్రాలను కలపాలని కోరుకుంటున్నవారకి `బుద్ధిలేదు` అని సీరియస్ కామెంట్లే చేశారు. నిజానికి ఈ కామెంట్లు ఏపీలో దాదాపు 15 రోజలు కిందట తెరమీదికి వచ్చాయి. ప్రస్తుతం ఏపీ విభజన జరిగిన తీరుపై సుప్రీకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేశారు. అయితే..ఏపీ ప్రభుత్వం దీనిలో ఇంప్లీడ్ కావాలని.. లేకపోతే.. జగన్ ఇంతకన్నా ద్రోహం చేసినవారు లేకుండా పోతారని కూడా ఆయన అన్నారు.
దీనిపై అప్పట్లో స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సమైక్య వాదిగా జగన్‌ను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. రెండు రాష్ట్రాలు మళ్లీ కలవాలని కోరుతున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అయితే.. అప్పట్లో మౌనంగా ఉన్న చంద్రబాబు.. తాజాగా ఖమ్మంలో మాత్రం ఈ విషయా న్ని ప్రస్తావించారు. అయితే.. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో రెండు ప్రయోజనాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
ఒకటి.. ఏపీలో జగన్ వ్యూహానికి ఆయన చెక్ పెట్టడం. అయిపోయిన రాష్ట్ర విభజనను అడ్డుపెట్టుకుని మళ్లీ పుంజుకునేందుకు జగన్‌ప్రయత్నిస్తున్నారని.. కాని ఇది సాధ్యం కాదని చంద్రబాబు మాటల అంతరార్థంగా ఉంది. రెండు.. తెలంగాణలో అధికార పార్టీ ఎప్పుడు ఏ సెంటిమెంటు లభిస్తే.. దానిని పట్టుకుని విజయం దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక, చంద్రబాబే విభజిత రాష్ట్రాలను కలపాల్సిన అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించడంతో కేసీఆర్‌కు ఈ చాన్స్ లేకుండా చేయడం.
అదేసమయంలో టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అనే ముద్ర వేయకుండా.. కూడా చంద్రబాబు జాగ్రత్త పడినట్టు అయింది. అంటే.. తాము ఏపీకి చెందిన వారమే అయినా.. తెలంగా ణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, తెలంగాణ రాష్ట్రం కొనసాగుతుందని ఇక్కడి వారికి చంద్రబాబు భరోసా కల్పించడం ద్వారా.. టీడీపీకి దెబ్బ పడకుండా కాపాడుకున్నట్టుగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.