Begin typing your search above and press return to search.
మూడు రాజధానుల పై మండి పడ్డ బాబు .. తుగ్లక్ పాలన అంటూ !
By: Tupaki Desk | 18 Dec 2019 2:16 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని వికేంద్రీకరణ జరగాలని , రాజధాని పై నిపుణుల కమిటీ మరోవారం రోజుల్లో నివేదిక ఇస్తుందని సీఎం చెప్పారు. ఆ తరువాత రాజధాని పై స్పష్టమైన అవగాహన వస్తుంది అని చెప్పారు. ఇక సీఎం జగన్ మూడు రాజధానుల పై మాట్లాడుతూ .. అమరావతి లో లెజిస్టేటివ్ క్యాపిటల్, కర్నూలు లో హైకోర్టు, జ్యుడీషియల్ క్యాపిటల్, వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చని అన్నారు.
చంద్రబాబు అమరావతి లో దోపిడీ కి పాల్పడ్డారని , చంద్రబాబు రాజధాని కోసం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని అన్నారు. అమరావతిలో చంద్రబాబు బినామీల చేత ముందుగానే భూములు కొనుగోలు చేయించారని జగన్ చెప్పారు. 4070 ఎకరాల భూములను చంద్రబాబు బినామీలు కొనుగోలు చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు పలు అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇకపోతే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం పై ప్రతిపక్ష నేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ ది తుగ్లక్ పాలన అని చంద్రబాబు విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతి ని జగన్ చంపేయాలని చూస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయటానికి డబ్బులు ఉండాలి కదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే మూడు రాజధానులని ప్రకటిస్తే ..సీఎం జగన్ అమరావతి లో ఉంటారా...? విశాఖలో ఉంటారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ దిశగా పయనిస్తోందో అర్థం కావడం లేదని , ప్రజలు ప్రాంతాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం జగన్ వైజాగ్, కర్నూల్ లో కూడా ఇళ్లు కట్టుకుంటారా...? అని బాబు ప్రశ్నించారు. జగన్ ఆలోచన వలన ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని, జగన్‌ది పిచ్చి తుగ్లక్ పాలన అని అన్నారు.