Begin typing your search above and press return to search.

వైసీపీ 'జ‌య‌హో బీసీ' స‌భ‌పై చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   8 Dec 2022 4:23 PM GMT
వైసీపీ జ‌య‌హో బీసీ స‌భ‌పై చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఇదే!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీ నేత‌లు విజ‌య‌వాడ కేంద్రంగా నిర్వ‌హించిన 'జ‌య‌హో బీసీ' స‌భ‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్పందించారు. ప్ర‌స్తుతం బాప‌ట్ల జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న బీసీ స‌భ‌పై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్కు మూడున్నరేళ్ల తర్వాత బీసీలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. క‌నీసం.. ఒక్క ప‌థ‌క‌మైనా వారికి ప్ర‌క‌టించారా? అని నిల‌దీశారు.

వైసీపీ నిర్వ‌హించిన బీసీ సభకు జనాలకు బలవంతంగా తరలించారని అన్నారు. రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించారని చంద్ర‌బాబు ఆరోపించారు. పిల్లల భవిష్యత్ బాగుండాల‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారని తెలిపారు. అయితే.. ఇప్పుడు ఎక్క‌డ ఎలా చూసుకున్నా వైసీపీ పాల‌న‌లో వృద్ధుల నుంచి యువ‌త వ‌ర‌కు అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని చంద్రబాబు సూచించారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. సీఎం జగన్, ఆయ‌న పార్టీ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

బస్సులు పెట్టి మరి బీసీ సభకు జనాన్ని తరలించారన్నారు. ''నాకు కొత్తగా సీఎం పదవి అవసరమా? '' అని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రం, పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే తాను ఈ వ‌య‌సులోనూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వచ్చానని పేర్కొన్నా రు. బుడంపాడు నుంచి బైక్ ర్యాలీతో చంద్రబాబు పర్యటన ముందుకు సాగింది.

నారాకోడూరులో చంద్రబాబు పర్యటనకు టీడీపీ కార్యకర్తలతో పాటు జనం భారీగా తరలివచ్చారు. మూడు రోజుల పాటు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. కాగా, చంద్ర‌బాబును చూసేందుకు, ఆయ‌న చెప్పేది వినేందుకు జ‌నాలు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.