Begin typing your search above and press return to search.
ఎన్డీయేలో టీడీపీ చేరికపై చంద్రబాబు రియాక్షన్ ఇదే
By: Tupaki Desk | 2 Sep 2022 5:33 AM GMTమోడీ భావజాలానికి దగ్గరగా ఉండే జాతీయ మీడియా సంస్థ ఒకటి ప్రసారం చేసిన వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చకు తెర తీసింది. అనూహ్యంగా వెలుగులోకి తెచ్చిన ఈ వార్తకు మూలాలేంటి? ఎందుకు అలాంటి వార్తను ప్రసారం చేశారన్న దానిపై అటు బీజేపీతో పాటు టీడీపీకి చెందిన పలువురు ఆరా తీస్తున్నారు. ఇంతకూ అంతటి అలజడికి కారణమైన స్టోరీ ఏంటంటే.. టీడీపీ - బీజేపీ కలయిక.
కామెడీ ఏమంటే.. సదరు చానల్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో సరైన నెట్ వర్కు లేకపోవటమే కాదు.. పట్టుమని పది మంది రిపోర్టర్లు కూడా ఉండరు. అలాంటి మీడియా సంస్థ ఇంత పెద్ద రాజకీయ పరిణామాన్ని ఎలా చెప్పగలిగింది? తెలుగు రాష్ట్రాల్లోని కీలక రాజకీయ పరిణామంపై దాని అంచనాలో నిజమెంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నిజానికి అటు బీజేపీలో కానీ ఇటు టీడీపీలో కానీ చేరిక అంశంపై ఎలాంటి చర్చా రెండు పార్టీల మధ్య జరగలేదు. అయినప్పటికీ అందుకు భిన్నంగా ప్రసారమైన పొలిటికల్ కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ అంచనాపై ఇప్పటికే బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ క్లారిటీ ఇస్తూ.. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. అయినప్పటికీ మీడియా ప్రతినిధులు మాత్రం ఈ అంశంపై ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధిస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును సైతం ఇదే ప్రశ్నను సంధించారు. దీనికి బదులిచ్చిన చంద్రబాబు.. కర్ర విరగ కూడదు.. పాము చావకూడదన్న రీతిలో రియాక్ట్ కావటం గమనార్హం.
ప్రశ్న ఏదైనా సమాధానం సుదీర్ఘంగా సాగదీసే అలవాటు ఉన్న చంద్రబాబు.. తన తీరుకు భిన్నంగా ఈ అంశంపై స్పందించారు. ఎన్డీయేలో చేరతామన్న దానిపై రియాక్టు అయ్యేందుకు ఆయన నో చెప్పారు. నిజానికి ఆ ప్రచారం చేసే వారే దానికి సమాదానం చెప్పాలంటూ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎన్డీయేలోకి బయటకు వచ్చామన్న విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాల్ని చూస్తామన్నారు.
పాలనపై ఎక్కువగా ఫోకస్ చేయటంతోనే పార్టీ రెండు సార్లు ఓడిందన్న ఆయన.. రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలన్న తపనతో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామన్నారు. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టం కంటే కూడా.. జగన్ పాలన కారణంగా నష్టపోయిందే ఎక్కువంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. తాను అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తామన్న ఆయన.. విభజన గాయాలు.. ఆర్థిక లోటు లోనూ సందర్భంలోనూ సంక్షేమ పథకాల్ని అమలు చేశామన్నారు.
మొత్తంగా చూస్తే.. తొందరపడి నోరు జారకుండా.. జాగ్రత్తగా వ్యవహరించేలా బాబు వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత .. దానికి వచ్చే ఫలితాల ఆధారంగా బీజేపీ - టీడీపీ పొత్త ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.