Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఈవీఎం వ్యతిరేక పోరు వెనుక ఇంత ప్లాన్ ఉందా?
By: Tupaki Desk | 27 Dec 2018 10:08 AM GMTఈవీఎంలతో ఎన్నికలు జరిగితే గోల్ మాల్ జరుగుతోంది.. రానున్న ఎన్నికలు బ్యాలట్ పద్ధతిలో జరగాలంటూ ఏపీ సీఎం గొంతు చించుకుంటున్నారు. తనను ఏ పార్టీ నేత కలిసినా వారి దగ్గర అదే విషయం ప్రస్తావనకు తెచ్చి.. మొహమాట పెట్టి వాళ్లతో తలూపించి వారు కూడా తనకు ఈ విషయంలో మద్దతు పలికారని చెబుతూ చంద్రబాబు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. ఎలాగైనా బ్యాలట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరిగితే బాగున్నని ఆయన ఆశపడుతున్నారు. కానీ... అదంతా జరిగే విషయం కాదు. అయితే, చంద్రబాబు బ్యాలట్ విధానం కోసం ఎందుకింత పట్టుపడుతున్నారు? టెక్నాలజీకి తాతను అని చెప్పుకొనే ఆయన మళ్లీ వెనక్కు వెళ్లాలంటున్నారెందుకు? అని ఆలోచిస్తే అసలు సంగతి బోధపడుతుంది.
ఏపీలో ప్రస్తుతం చంద్రబాబుకు తీవ్రమైన ఎదురుగాలి వీస్తోంది. అభివృద్ధిలేదు.. అమరావతి లేదు.. ఉద్యోగాల్లేవు.. ఉపాధి లేదు.. గవర్నమెంటు ఆఫీసుల్లో పనులు కావడం లేదు... ఆసుపత్రుల్లో సేవల్లేవు.. ఆరోగ్య శ్రీ లేదు.. 108 లేదు... ఇల్లు లేదు.. ఇలా.. ఒకటేమిటి అసలు ప్రభుత్వం నుంచి ప్రజలకు రూపాయి లబ్ధి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా చంద్రబాబును ఎప్పుడెప్పుడుదించేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ సంగతి చంద్రబాబు సొంత సర్వేల్లోనూ పదేపదే తెలుస్తోంది. దీంతో... ఈవీఎంల విధానంలో ఎన్నికలు జరిగితే దారుణంగా ఓడిపోవడం ఖాయమని అర్థమైన ఆయన బ్యాలట్ ఎత్తుగడ వేసినట్లు చెబుతున్నారు.
ఎలాగూ అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్ధలను మ్యానేజ్ చేసుకుని ఎన్నికల్లో గట్టెక్కాలన్నది చంద్రబాబు ఆలోచనగా అనుమానిస్తున్నారు. అందుకు ఏకైక మార్గం రిగ్గింగ్. ఈవిఎం ఓటింగ్ అంటే రిగ్గింగ్ కష్టం. అదే పేపర్ బ్యాలెట్ అంటే చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత. అధికారంలో ఉంటారు కాబట్టి పోలీసు వ్యవస్ధ ఎలాగూ చెప్పుచేతల్లోనే ఉంటుంది. ప్రతిపక్ష పార్టీల పోలింగ్ ఏజెంట్లను మ్యానేజ్ చేసుకుంటే చాలు సరిపోతుంది. అందుకనే పదే పదే బ్యాలెట్ ఓటింగ్ గురించి డిమాండ్ చేస్తున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే.. చంద్రబాబు డిమాండుకు దేశంలోని ఏ పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు అయితే దొరకడం లేదు. అన్నీ మొహమాటానికి తలూపుతున్న పార్టీలే కానీ, బ్యాలట్ విధానాన్ని ఎవరూ ఇష్టపడడం లేదు.