Begin typing your search above and press return to search.
భారీ వర్షాలతో మునిగిన చంద్రబాబు నివాసం
By: Tupaki Desk | 19 Nov 2021 4:55 AM GMTఒకటి తర్వాత ఒకటిగా బ్యాడ్ న్యూసులన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు..ఆయన పార్టీ టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం కోట తాజాగా జరిగిన ఎన్నికల్లో కుప్పకూలిపోవటం షాకింగ్ గా మారింది. టీడీపీ వర్గాలు ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధికార వైసీపీ విజయాన్ని సాధించింది. ఈ ఫలితం వెలువడిన 24 గంటలు కూడా కాక ముందే.. మరోసారి చంద్రబాబు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో చంద్రబాబు నివాసం నీట మునిగింది.
భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇంటి వెనుక ఉన్న పొలాల నుంచి పోటెత్తిన వరద నీటితో బాబు నివాసం వరద నీటిలో చిక్కుకుపోయింది. భద్రతా సిబ్బంది ఉండే గదితో పాటు ఉద్యానవనం మునిగినట్లుగా చెబుతున్నారు. భారీ వర్షం కారణంగా మునిగిన చంద్రబాబు నివాసాన్ని పంచాయితీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో.. సర్పంచ్ లక్ష్మీ భర్త గిరినాయుడు.. చంద్రబాబు సోదరుడు సుబ్రహ్మణ్యం నాయుడు సాయంతో నీటిని బయటకు పంపుతున్నారు.
భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఇంటి వెనుకనే పొలాలు ఉండటం కూడా వరద నీరు పెద్ద ఎత్తున రావటానికి కారణమైందంటున్నారు.