Begin typing your search above and press return to search.
కేసీయార్ కి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇదేనా...?
By: Tupaki Desk | 14 Dec 2022 9:35 AM GMTఅవును కదూ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదూ. అవతల వారు గిఫ్ట్ ఇస్తే ఇవతల వారు ఉంచుకోకూడదు కదా. తిరిగి ఇవ్వకపోతే లావు అయిపోతారు కూడా. ఎంతైనా రాజకీయాల్లో తీసుకోవడమే కాదు సరైన సమయం చూసి ఇచ్చేయాలి కదా. ఇపుడు అదే పనిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన మూడున్నరేళ్ల క్రితం కేసీయార్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన దాన్ని బాగా గుర్తు పెట్టుకున్నారు.
సరైన సమయం సందర్భం చూసి వడ్డీ తో సహా తాను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. అందుకోసం బాబు మార్క్ పాలిటిక్స్ కి పదును పెడుతున్నరు. ఇంతకీ ఈ రిటర్న్ గిఫ్ట్ కధా ఏంటి అంటే చాలా తమాషా ఉంది. 2018 ఎన్నికల వేళ చంద్రబాబు కాంగ్రెస్ తో కలసి తెలంగాణాలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేసీయార్ రెండవసారి బంపర్ మెజారిటీతో గెలిచారు. అయితే గెలిచిన తరువాత మొదటి ప్రెస్ మీట్ లోనే ఆయన బాబు మీద తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు.
చంద్రబాబు ఏపీ నుంచి వచ్చి మరీ తన మీద రాజకీయ యుద్ధం చేశారు కదా. ఆయన తనను ఓడించాలని చూశారు కదా. అందుకే ఆయనకు కూడా తాను రిటర్న్ గిఫ్ట్ ని ఒక దానిని రెడీ చేస్తున్నాను అని మీడియా ముందే ప్రకటించి మరీ 2019 ఎన్నికల్లో బాబు ఓటమికి తానూ ఇండైరెక్ట్ గా కారణం అయ్యారు. జగన్ కి పరోక్షంగా హెల్ప్ చేయడం ద్వారా కేసీయార్ ని మాజీని చేశారు. దాంతో ఆనాడు రిటర్న్ గిఫ్ట్ తీసుకున్న బాబు గమ్మున ఉన్నారు.
ఇపుడు గిర్రున కాలం తిరిగింది. కేసీయార్ తన టీయారెస్ పార్టీని కాస్తా బీయారెస్ గా మార్చేశారు. దాంతో తెలంగాణాలో ఇంకా దూకుడుగా ధాటీ గా పోటీ చేయడానికి బాబు చూస్తున్నారు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని ఆయన పటిష్టం చేస్తున్నారు. టీడీపీ అంటే బీసీల పార్టీ అని పేరు. అందుకే మరోసారి బీసీలను టీడీపీ వైపున నడిపించడం ద్వారా ఆ పార్టీని తెలంగాణాలో గట్టిగా నిలబెట్టాలని చూస్తున్నారు.
బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ని తెచ్చి మరీ ఆయనకు తెలంగాణీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. బీసీలలో పలుకుబడి ఉన్న కాసాని ఇపుడు తన పవర్ చూపిస్తున్నారు. తొందరలోనే ఖమ్మంలో అతి పెద్ద సభను ఆయన ఏర్పాటు చేశారు. ఆ సభకు చంద్రబాబు హాజరవుతున్నారు. ఆ మీదట వరసగా తెలంగాణ అంతటా కూదా టీడీపీ సభలను నిర్వహించాలని చూస్తున్నారు. బీసీలనే టార్గెట్ చేసుకుని బాబు రాజకీయ మంత్రాంగం నడుపుతున్నారు.
తెలంగాణాలో పెద్ద సంఖ్యలో బీసీలు ఉన్నారు. దాంతో వారిని ఏ మాత్రం ఆకర్షించినా టీడీపీకి ఎదురు ఉండదని బాబు భావిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఉంది. తెలంగాణా రాజకీయాల్లో బీజేపీ అధికారం మీద కన్నేసింది. దాంతో ఆ పార్టీతో పొత్తుల కోసం చంద్రబాబు చూస్తున్న్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ ఓటు షేర్ ని ఏకంగా ఆరేడు శాతంగా పెంచుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అదే జరిగితే కచ్చితంగా బీజేపీ తన వైపు చూస్తుందని, ఆ పొత్తు ఏపీ దాకా పాకి జగన్ కి ఇబ్బందిగా మారుతుందని, చివరికి తనకు అన్ని విధాలుగా కలసి వస్తుంది అని ఆయన భావిస్తున్నారు.
ఏపీలో బీజేపీని జగన్ నుంచి దూరం చేసి తమ వైపు తిప్పుకుటే 2024 ఎన్నికల్లో జనసేనతో కూడా కలుపుకుని గెలవవచ్చు అన్నది బాబు మార్క్ పాలిటిక్స్ గా ఉంది. దీంతో బాబు తెలంగాణాలో సైకిల్ స్పీడ్ పెంచేస్తున్నారు. అది కాస్తా ఇపుడు కేసీయార్ కి కూడా ఇరకాటంగా మారబోతోంది. బీజేపీ టీడీపీ కలసి తెలంగాణాలో పోటీ చేస్తే బీయారెస్ కి గట్టి పోటీగానే ఉంటుంది. దాంతో పాటు ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే కేసీయార్ అధికార పీఠానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.
దాంతో ఇపుడు కేసీయార్ బీయారెస్ అంటూ దేశమంతా తిరుగుతూంటే బాబు మాత్రం తెలంగాణా మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. టీయారెస్ బీయారెస్ అయిది. దాంతో కేసీయార్ తెలంగాణాలో పోటీ ఏంటి, ఆంధ్రుల పార్టీ టీడీపీ అని ఇక మీదట ఎక్కడా అనలేడు. దాంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బాబు తన బుర్రకు పదును పెడుతున్నారు. మొత్తానికి ఇపుడు బాబుకు అన్నీ కలసి వస్తున్నాయని అంటున్నారు. ఈ దెబ్బతో బాబు నుంచి కేసీయార్ కి రిటర్న్ గిఫ్ట్ వెళ్తుంది అని అంటున్నారు. రాజకీయాల్లో ఇదే తమాషా మరి. తాను ఇచ్చిన గిఫ్ట్ కి బదులు కేసీయార్ పుచ్చుకునేందుకు అందునా బాబు నుంచి తీసుకునేందుకు రెడీగానే ఉండాలిగా. అదన్న మాట మ్యాటర్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.