Begin typing your search above and press return to search.
బాబు ఒప్పేసుకున్నాడు.. పవన్ తో నిజమే..
By: Tupaki Desk | 12 Oct 2019 5:41 AM GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంతసేపు ప్రతిపక్ష నేత అయిన జగన్ ను తిట్టడమే కానీ.. అధికారంలో ఉన్న చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. ఇక చంద్రబాబు, లోకేష్ లు పోటీచేసిన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను నిలబెట్టలేదు.. ప్రచారం కూడా చేయలేదు..
ఇక చంద్రబాబు, లోకేష్ లు అంతే ప్రేమను కనబరిచారు. పవన్ కళ్యాన్ పోటీచేసిన గాజువాక - భీమవరంలో టీడీపీ తరుఫున డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి టీడీపీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయలేదు.
చంద్రబాబు-పవన్ క్విడ్ ప్రోకోపై ప్రతిపక్ష వైసీపీ, జగన్ లు ఎన్నో విమర్శలు చేసినా బాబు - పవన్ లు కొట్టిపారేశారు. కానీ తాజాగా చంద్రబాబు ఒప్పేసుకున్నారు. విశాఖ జిల్లా పర్యటనలో గాజువాక నేతలతో సమావేశం సందర్భంగా ఈ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ పై ప్రేమను చాటారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడు పట్ల హుందాతనం ప్రదర్శించాలనే తాను పర్యటించలేదని వివరణ ఇచ్చారు. జనసేన బలం అంతో ఇంతో టీడీపీపై ఉంటుందనే ఆలోచన చేశామే తప్ప లాలూచీ ఆలోచన లేదని బాబు చెప్పుకొచ్చారు. పవన్ ఒప్పుకుంటే పొత్తు పెట్టుకునేవాళ్లమని వ్యాఖ్యానించారు.
ఇక బీజేపీతోనూ తాను వ్యవహరించిన తీరు సరికాదని బాబు పశ్చాత్తాపపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలోని బీజేపీతో విభేదించామని.. దాని వల్ల నష్టపోయామని చంద్రబాబు వాపోయారు. రాష్ట్రానికి లాభం జరగలేదని.. పార్టీకి నష్టం వాటిల్లిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయోజనం పొందిన ప్రజలు సైతం తనకు సహకరించలేదని చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు.