Begin typing your search above and press return to search.

'రింగు' భ‌లే చంద్ర‌బాబు... దాని ఖ‌రీదు రూ.30వేలు!

By:  Tupaki Desk   |   9 Dec 2022 1:30 AM GMT
రింగు భ‌లే చంద్ర‌బాబు... దాని ఖ‌రీదు రూ.30వేలు!
X
మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు గురించి చెప్ప‌క్క‌ర్లేదు. దేశంలో ఆయ‌నొక టెకీ సావీ పొలిటీషియ‌న్‌గా గుర్తింపు పొందారు. టెక్నాల‌జీని అమితంగా ఇష్ట‌ప‌డే చంద్ర‌బాబు దాని ప్రోత్సాహానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అంతే కాదు ఆయ‌న ప‌లు ర‌కాల టెకీ గ్యాడ్జెట్స్ కూడా ఉప‌యోగిస్తుంటారు.

ఆ మ‌ధ్య ఆయ‌న త‌న ఎడ‌మ‌చేతి చూపుడు వేలుకు ఒక స్మార్ట్ రింగ్ (ఉంగ‌రం) ధ‌రించ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో పాల్గొన‌డానికి చంద్ర‌బాబు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న ధ‌రించిన ఈ స్మార్ట్ ఉంగ‌రం మ‌రోమారు తెర‌పైకి వ‌చ్చింది. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో ఇష్టాగోష్టి స‌మావేశం నిర్వ‌హించిన‌ప్పుడు ఆయ‌న ధ‌రించిన ఈ స్మార్ట్ రింగ్ గురించి మీడియా ప్ర‌తినిధులు మ‌రోమారు అడిగి తెలుసుకున్నారు.

నేనెప్పుడూ నా చూపుడు వేలుకు ఉంగ‌రం ధ‌రిస్తుంటాను. అయితే ఇది మీర‌నుకున్న‌ట్లు మామూలుగా అలంకారం కోసం పెట్టుకున్న ఉంగ‌రం కాదు. ఇది నా ఫిట్‌నెస్ గురించి తెలియ‌జేసే ఉంగ‌రం. ఇది నా ఆరోగ్య ప‌రిస్థితిని ట్రాక్ చేసి దాన్ని ఆ వెంట‌నే నా ఫోన్‌కు పంపుతుంది.

ఈ రింగులో ఒక అడ్వాన్స్‌డ్ చిప్ కూడా ఉంది అది నా శ‌రీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌, బీపీ, షుగ‌ర్ స్థాయిల‌ను క‌నిపెడుతుంటుంది. నా ఆరోగ్యానికి సంబంధించి మొత్తం డాటాను అది క్రోడీక‌రించి దాన్ని నా ఫోన్‌కు పంపుతుంది అని చంద్ర‌బాబు త‌న ఉంగ‌రం విశేషాల‌ను మ‌రోసారి మీడియా ప్ర‌తినిధుల‌తో పంచుకున్నారు.

అయితే ఈ స్మార్ట్ ఉంగ‌రం ఖ‌రీదైన‌దే. ఈ ఉంగ‌రం రూ.30వేల ఖ‌రీదు పెట్టి కొన్నాన‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. ఈ ఉంగ‌రం ధ‌రించ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎలాంటి హానీ ఉండ‌బోద‌ట‌. శ‌రీరానికి హానీ చేసే ఎలాంటి రేడియేష‌న్ కూడా ఈ ఉంగ‌రం నుంచీ రాద‌ని తెలిపారు. దీనివ‌ల్ల ఈ ఉంగ‌రం ధ‌రించ‌డం ఆరోగ్యానికి అన్నివిధాల శ్రేయ‌స్క‌ర‌మేన‌ని చెప్పారు.

త‌న స్మార్ట్ ఉంగ‌రం గురించి చంద్ర‌బాబు వెల్ల‌డించిన తాజా వివేషాలు తెలుగు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి. ఈ ఉంగ‌రం గురించి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఉంగ‌రం గురించి నెట్‌లో నెటిజ‌న్లు శోధించ‌డం కూడా పెరిగింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.