Begin typing your search above and press return to search.

అప్పులతో ఏపీ బ్రాండ్ దెబ్బతింటుందట.. బాబు ఆవేదన మామూలుగా లేదే?

By:  Tupaki Desk   |   30 Nov 2021 1:30 AM GMT
అప్పులతో ఏపీ బ్రాండ్ దెబ్బతింటుందట.. బాబు ఆవేదన మామూలుగా లేదే?
X
చంద్రబాబు మరోసారి బరస్ట్ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని చూసి జగన్ ను టార్గెట్ చేశారు. తనహాయాంలో అమరావతి కోసం.. సర్కార్ నడిపించేందుకు చేసిన 2లక్షల కోట్ల అప్పును పక్కనపెట్టిన చంద్రబాబు తాజాగా జగన్ ను టార్గెట్ చేయడం విశేషం.

జగన్ సర్కార్ చేస్తున్న అప్పులతో ఏపీ బ్రాండ్ దెబ్బతింటోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అధికార యంత్రాంగం వైఫల్యంపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు.

వరద బాధితులకు ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. వరి వేయవద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారన్నారు. గౌరవ అసెంబ్లీని కౌరవసభగా మార్చారన్నారు. చట్ట వ్యతిరేక నిధుల బదిలీని తక్షణమే విరమించుకోవాలని చంద్రబాబు అన్నారు.

ఏపీలో వచ్చిన వరదల్లో చనిపోయిన వారిని ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను చేతగానితనంగా అభివర్ణించారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులు రూ.1100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారిమళ్లించారని ఆరోపించారు. వరి వేయొద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారన్నారు. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొందన్నారు. డ్వాక్రా మహిళల ఎల్ఐసీ సొమ్మును స్వాహా చశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు రూపాయి కట్టాల్సిన అవసరం లేదని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.