Begin typing your search above and press return to search.
చంద్రబాబు తర్వాత ఎవరు? ఆన్సర్ త్వరలో విడుదల!
By: Tupaki Desk | 29 March 2022 12:30 AM GMTఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయా? పార్టీ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందా? అంటే... ఔననే అంటున్నారు పార్టీలోని సీనియర్ నాయకులు. ఎందుకంటే.. పార్టీలో కీలక నాయకుడికి కొరత ఉంది. చంద్రబాబు తర్వాత.. ఎవరు? అంటే.. లోలోన లోకేష్ అనే గుసగుస వినిపించినా. ఆయన ప్రస్తుతానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాత్రమే. ఇలాంటి జాతీయ ప్రధాన కార్యదర్శులు.. ఐదుగురు వున్నారు. వీరిలో లోకేష్ కొంచెంప్రత్యేకం అంతే!
కానీ, ఇప్పుడు.. చంద్రబాబు తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు బాబు పరిష్కారం చూపించేందుకు రెడీ అ య్యారని చెబుతున్నారు. దీనిలో భాగంగా.. లోకేష్‌కు త్వరలోనే.. కీలకమైన పదవిని అప్పగించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 2018లో జరిగిన మహానాడులోనేలోకేష్‌కు ముఖ్యమైన పదవి ఇవ్వాలని.. పార్టీలో నెంబర్ 2గా ఆయనను మార్చాలని.. పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి అయితే.. ఈ క్రమంలో వైసీపీ నుంచివచ్చిన విమర్శలు..టీడీపీ సీనియర్ల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో చంద్రబాబు వెనుకడుగు వేశారు.
లోకేష్‌కుఅనుభవం సరిపోదని.. ఇంకా ప్రజల్లోకి వెళ్లాలని.. అప్పట్లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితం గా ఉండే.. యనమల రామకృష్ణుడు వంటివారు.. సలహా ఇచ్చారు. ఇక, బుచ్చయ్య చౌదరి అయితే.. నేరుగానే బహిరంగ విమర్శలు చేశారు.. ఏం అనుభవం ఉందని.. కీలక పోస్టులు ఇస్తారు? రాష్ట్రంలో ఎన్ని మండలాలున్నాయో.. తెలుసా? అంటూ..లోకేష్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.. ఈ పరిణామాలు తీవ్రంగా మారితే.. పార్టీకి ముప్పని భావించిన చంద్రబాబు అప్పట్లో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.
కానీ, ఇటీవల కాలంలో లోకేష్ పుంజుకున్నారు. ప్రజల మధ్య ఉంటున్నారు.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై కాలుదువ్వుతున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు ప్రజావేదికలపైనా.. ఆయన బాగానే మాట్లాడుతున్నారు. ఆహార్యం.. వ్యవహారం కూడా మారిన నేపథ్యంలో లోకేష్‌కు పట్టం కట్టేందుకు ఇదే సరైన సమయం అని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీలో కార్య నిర్వాహక అధ్యక్ష పదవిని(వర్కింగ్ ప్రెసిడెంట్) సృజించి.. దానిని లోకేష్‌కు అప్పగించే ప్రయత్నాల్లో ఉన్నారు.
పొరుగున తెలంగాణ అధికార పార్టీలోనూ కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా.. కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. ఇలానే.. టీడీపీలోనూ మార్పులు తీసుకువచ్చి.. దాదాపు కుమారుడికి.. పార్టీని అప్పగించే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని.. 40 వసంతాల వేడుకలో ఆయన ఈ ప్రకటన చేయడం ఖాయమని సీనియర్లు కొందరు గుసగుసలాడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.