Begin typing your search above and press return to search.

ఇద్దరు తమ్ముళ్లకు కబురు పంపిన బాబు

By:  Tupaki Desk   |   7 Jan 2017 10:23 AM GMT
ఇద్దరు తమ్ముళ్లకు కబురు పంపిన బాబు
X
సమస్య వచ్చి పడితే దానిపై వెంటనే స్పందించే కంటే.. ఆచితూచి వ్యవహరించటం.. సరైన సమయం కోసం వెయిట్ చేయటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక అలవాటుగా చెబుతుంటారు. సీనియర్ నేతలు కొందరు గీత దాటి వ్యాఖ్యలు చేసినా.. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారని పార్టీ నేతలే తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. అయితే.. అందుకు భిన్నంగా ఉంది తాజా యవ్వారం. తమ్ముళ్లు తోక జాడిస్తే.. పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని అందరికి తెలిసేలా తాజాగా రియాక్ట్ అయ్యారు చంద్రబాబు.

ఇటీవల గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వ్యవహారం కాంట్రావర్సీగా మారగా.. తాజాగా గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీశ్ చేసిన రచ్చ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది. అధికారం తమ్ముళ్లకు బాగా పట్టేసిందని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు తరచూ వినిపిస్తున్న వేళ.. రోజుల వ్యవధిలో పక్కపక్క జిల్లాలకు చెందిన ఇద్దరు తమ్ముళ్ల వ్యవహారం పార్టీ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీసినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పర్యాటక శాఖకు చెందిన గెస్ట్ హౌస్ లో మందుపార్టీ చేసుకున్న సందర్భంగా అక్కడి అధికారిపై ఎమ్మెల్సీ దాడి చేయటమే కాదు.. ఫర్నీచర్ ను ధ్వంసం చేయటం ఇష్యూగా మారింది. మీడియాలో పెద్ద ఎత్తున ఫోకస్ కావటంతో డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నాల్ని మొదలెట్టారు చంద్రబాబు. తాజా ఉదంతంతో తక్షణమే తన వద్దకు రావాలంటూ రావి వెంకటేశ్వరరావుకు.. అన్నం సతీశ్ కు కబురు పెట్టారు. ఇటీవల కాలంలో తెలుగు తమ్ముళ్లపై వస్తున్న విమర్శల విషయంలో బాబు సీరియస్ గా ఉన్నారని.. గట్టి నిర్ణయం తీసుకోవటం ద్వారా తమ్ముళ్లకు బలమైన సంకేతాల్ని పంపించాలన్న సూచన బాబుకు పలువురు చేస్తున్నారు. ఇలాంటి వేళ.. ఇద్దరు తమ్ముళ్లు వెంటనే తన దగ్గరకు రావాలంటూ బాబు కబురు పంపిన తీరు చూస్తే.. గీత దాటే నేతల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న విషయాన్ని బాబు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/