Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   12 Feb 2022 12:33 PM GMT
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
X
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. మొన్న అర్ధరాత్రి టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్లు అశోక్ బాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. సీఐడీ అధికారులు కిడ్నాప్ చేసినట్టు చేశారని.. విచారణ పూర్తైనా ఆరోపణలపై మళ్లీ కేసు నమోదు చేశారని ఆరోపించారు. జగన్ ఉన్మాది సీఎం అని చంద్రబాబు మండిపడ్డారు. మొదటి ఎఫ్ఐఆర్ కు సెక్షన్లు ఎందుకు మార్చారని ఆరోపించారు.

అశోక్ బాబును అరెస్ట్ చేసి ఏం విచారణ చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో చట్టప్రకారం పాలన జరగాలని.. పోలీసులు కూడా చట్టప్రకారమే వ్యవహరించాలన్నారు. లేకపోతే ప్రైవేటు కేసులు వేస్తామన్నారు. ప్రజలకు అండగా నిలబడడం .. పోరాటం చెయ్యడం నేరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ముగ్గురు మాజీ మంత్రులను ఏం నేరం చేశారని అరెస్ట్ చేశారని నిలదీశారు. ప్రభుత్వ వేధింపులతో కోడెలను పొట్టన పెట్టుకున్నారన్నారు. అనేకమంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారన్నారు చంద్రబాబు.

గుంటూరులో హత్యకు గురైన అనూష ఇంటికెళ్లి పరామర్శిస్తే లోకేష్ పై కేసుపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. 33 మంది టీడీపీ నేతలను దారుణంగా హత్య చేశారన్నారు. ప్రభుత్వం టెర్రరిస్టులా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు.

వివేకాను హత్యచేసి నాటకాలాడి నిందితులను హత్య చేయాలని చూస్తున్నారు. తప్పుడు రాజకీయాలు చేయాలనుకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. జైలర్ వరుణ్ రెడ్డిని కడపకు ఎందుకు పంపించారని చంద్రబాబు ఆరోపించారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు జైలర్ గా వరుణ్ రెడ్డి ఉన్నారని చంద్రబాబు మండిపడ్డారు.